ఎనిమిది మందిపై అట్రాసిటి కేసు
జవహర్‌నగర్: కులంపేరుతో ఓ వ్యక్తిని దూషించి గాయపర్చిన 8 మందిపై జవహర్‌నగర్ పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. సీఐ అశోక్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్‌లో నివసిస్తున్న బొగ్గుల ప్రణయ్ (22) గతనెల 31న బోనాల పండుగ సందర్భంగా దేవాలయానికి వెళ్తుండగా కౌకూర్‌కు చెందిన వాసుదేవరెడ్డి, శంకర్‌రెడ్డి అతడిని అడ్డగించి కులంపేరుతో దూషించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎన్.హనుమంతరెడ్డి, జి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి తదతరులు ప్రణయ్ తిరిగి దూషించి తీవ్రంగా దాడి చేసి చంపేస్తామని బెదిరించారు. ఆదివారం ఉదయం బాధితుడి సోదరుడు ఉదయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.