jawan injured
-
కశ్మీర్లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన జావిద్ అహ్మద్ దార్గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్ జిల్లా బస్కచాన్ ప్రాంతంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్ జిల్లా నౌపొరా వాసి అహ్మద్ భట్ హతమయ్యాడు. -
ప్రెషర్ బాంబు పేలి జవానుకు తీవ్ర గాయాలు
పర్ణశాల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు (ఐఈడీ) పేలి డీఆర్జీ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం జరిగింది. ఎస్పీ మోహిత్ గార్గ్ కథనం ప్రకారం.. జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముగించుకొని బేస్ క్యాంపునకు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పరెడా గ్రామ సమీపంలో డీఆర్జీ జవాను కమ్లూ హేమ్లా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేయడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో తీవ్ర గాయాలైన హేమ్లా ను ముందుగా బేస్ క్యాంపునకు తరలించి ప్రథమ చికిత్స అందించి, అనంతరం బీజాపుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జవాను పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. -
గన్ మిస్‌ఫైర్.. జవాన్‌కు గాయాలు
బక్సార్(బిహార్) : ఏకే-47 గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి ఐటీబీపీ జవాన్ గాయపడ్డాడు. అతడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... రాకేష్ కుమార్ ఐటీబీపీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గురువారం తన సర్వీస్ రివాల్వర్ ను క్లీన్ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో గన్ మిస్ ఫైర్ అయింది. రాకేష్ కుమార్ కాలుకు గాయాలయినట్లు సదార్ హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ ఆర్కే గుప్తా తెలిపారు. మెరుగైన చికిత్స కోసం రాకేష్ కుమార్ ను పట్నా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ కు తరలించినట్లు గుప్తా వివరించారు. బిహార్ ఎన్నికల నేపథ్యంలో అతడు బందోబస్తుకు వచ్చాడు. అదృష్టవశాత్తూ జవాన్ ప్రాణానికి ప్రమాదమేం లేదన్నట్లు తెలుస్తోంది.