శాంసంగ్‌కు మరిన్ని కష్టాలు
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ మరిన్ని కష్టాల్లో ఇరుక్కోనుంది. సౌత్ కొరియాలో సంచలనం రేపిన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంసంగ్ గ్రూప్ డి ఫ్యాక్టో హెడ్ జె వై లీ (48) పై అవినీతి సహా బహుళ ఆరోపణలపై ప్రత్యేక ప్రాసిక్యూటర్లు
కేసును దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈయనతోపాటు మరో నలుగురు ఎగ్జిక్యూటివ్‌లపై ఆరోపణలను నమోదు చేయనుంది. అరెస్టు వారెంట్‌నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన శాంసంగ్ వారసుడు చివరికి అరెస్టుకాక తప్పలేదు. తాజాగా కేసుల నమోదు ఖరారు కావడంతో శాంసంగ్ కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు
లీకు వ్యతిరేకంగా నిధుల దుర్వినియోగం, లంచం, అప్రకటిత విదేశీ ఆస్తులు తదితర ఆరోపణలను నమోదు చేయనున్నట్టు దక్షిణ కొరియన్ ప్రత్యేక ప్రాసిక్యూటర్ ప్రతినిధి లీ క్యు-చుల్ మంగళవారం విలేకరులకు చెప్పారు. ఈ విలక్షణ విచారణ , తీర్పు కు 18 నెలల వరకు పడుతుందనీ, అయినప్పటికీ, ప్రత్యేక-ప్రాసిక్యూటర్ చట్టం చాలా త్వరగా కేసు పరిష్కరించేందుకు సిఫార్సు చేసినట్టు చెప్పారు. మరోవైపు ఈ నేరారోపణలపై లీ బెయిల్ కోరే అవకాశం ఉంది. అలాగే మూడు నెలలోపు కోర్టు కోర్టు తన మొదటి తీర్పును జారీ చేయాల్సి ఉంది.
కాగా తాము ఎలాంటి తప్పులు చేయలేదని, లంచాలు ఇవ్వలేదని శాంసంగ్ సంస్థతో పాటు జే లీ కూడా వాదిస్తున్నారు. కోర్టు విచారణలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని , తాము ఎలాంటి తప్పు చేయలేదంటూఈ ఆరోపణలను లీ తిరస్కరించారు.