Jayam ravi actor
-
జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.అయితే తనకు విడాకులు కావాలని కోరుతూ జయం రవి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. కాగా.. ఈ రోజు జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ విచారణలో ఇరువురికి రాజీ కేంద్రంతో మాట్లాడి పరిష్కారం చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు.(ఇది చదవండి: భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి)2009లో సినీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని జయం రవి పెళ్లాడారు. వీరిద్దరికి ఆరవ్, అయాన్ పిల్లలు సంతానం కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మొదట జయం రవి సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలను తొలగించారు. కాగా.. జయం రవి 1989లో బాలనటుడిగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగారు. 2003లో విడుదలైన ‘జయం’ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకున్నారు. -
రూ. 100 కోట్ల బడ్జెట్.. 18 భాషల్లో విడుదల..కృతి శెట్టికి లక్కీ ఛాన్స్
కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయం రవి. ఈయన చిత్రాల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించి కొత్తదనం ఉన్న చిత్రాలను చేస్తుంటారు. పొన్నియిన్ సెల్వన్ వంటి చరిత్రాత్మక కథా చిత్రంలో నటించి, ఆ తరహా కథా పాత్రల్లోనూ సత్తా చాటారు. ఆ చిత్రం మంచి విజయం సాధించినా ఆ తర్వాత వచ్చిన ఇరైవన్ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి జీనీ. ఇందులో జయం రవి సరసన కృతి శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, వామిక కబీ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. దర్శకుడు అర్జునన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరీ గణేష్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. దీనిని రూ.100 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అదే విధంగా చిత్రాన్ని 18 భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా పొన్నియిన్‌సెల్వన్ చిత్రాన్ని పక్కన పెడితే జయం రవి నటిస్తున్న రూ.100 కోట్ల బడ్జెట్ చిత్రం ఇదే అవుతుంది. ఇది ఐసరి గణేష్ నిర్మిస్తున్న 25వ చిత్రం అన్నది గమనార్హం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీంతో జీవీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు సైరన్, బ్రదర్ తదితర చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అదే విధంగా తనీ ఒరువన్, ఎం.కుమరన్ సన్ఆఫ్ మహాలక్ష్మి చిత్రాల సీక్వెల్స్‌లో నటించేందుకు జయం రవి సిద్ధమవుతున్నారు. -
గ్యాంగ్‌స్టర్‌గా నటుడు జయంరవి.. రిలీజ్ డేట్ వచ్చేసింది
కథల ఎంపిక విషయంలో ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకునే నటుడిగా జయం రవికి పేరుంది. అందుకే ఆయన కెరీర్లో విజయాల శాతం ఎక్కువ. ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన భారీ చారిత్రక కథా చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లో టైటిల్ పాత్రను పోషించి శెభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. స్కీన్ర్ సీన్ సంస్థకే వరుసగా మూడు చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి అఖిలన్ చిత్రం. ఇందులో ఆయనకు జంటగా నటి ప్రియా భవానీ శంకర్ నటిస్తుండగా నటి తాన్యారవిచంద్రన్ మరో నాయకిగా ఎంపికైంది. ఎన్.కల్యాణ్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఉత్తర చెన్నై నేపధ్యంలో సాగే ఇందులో జయంరవి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇక శ్యామ్ సీఎస్.సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా అఖిలన్ చిత్రాన్ని మార్చి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. కాగా ఈ చిత్రం తరువాత జయంరవి నటుడు విక్రమ్, కార్తీ, విక్రమ్ ప్రభు, శరత్‌కుమార్, త్రిష, ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించిన పొన్నియిన్ సెల్వన్– 2 ఏప్రిల్ 28న తెరపైకి రానుంది. ఇవి కాకుండా జయం రవి ఇరైవన్, సైరన్ వంటి చిత్రాల్లోనూ నటిస్తున్నారు. వీటిలో నయనతారతో జత కడుతున్న ఇరైవన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈయన నటించిన చిత్రాలు బ్యాక్ టూ బ్యాక్ విడుదలకు సిద్ధం అవుతుండడం విశేషం.