Jayasankar Jayanti
-
జయశంకర్ లేకపోవడం బాధాకరం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బి.వినోద్‌కుమార్, కె.కవిత, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో, ప్రగతిపథం వైపు రాష్ట్రం వేస్తున్న అడుగులో జయశంకర్ లేకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్ర అభివృద్ధికి జయశంకర్‌తో కలసి రూపొందించుకున్న బ్లూప్రింట్‌నే నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. 1952 నుంచి తెలంగాణకు జరిగిన అన్యాయాలపై జయశంకర్ రాసి పెట్టుకున్న విషయాలే ఉద్యమాన్ని నడిపేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. పోరాటంలో నిబద్ధత, చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే దేన్నైనా సాధించవచ్చనేందుకు ఆయన జీవితమే నిదర్శనమన్నారు. జయశంకర్ ఆశయాన్ని నెరవేర్చింది కేసీఆరే జయశంకర్ జయంతి వేడుకలోమంత్రుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ జీవిత ఆశయాన్ని నెరవేర్చింది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రులు జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ చిరస్మరణీయుడు: కేసీఆర్ ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తిని కలిగించిన ప్రొఫెసర్ జయశంకర్ చిరస్మరణీయుడని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం జయశంకర్ జయంతి సందర్భంగా సీఎం ఆయనను గుర్తు చేసు కున్నారు. ఆయన ఆత్మ సంతృప్తి చెందేలా తెలంగాణ లో 50 నెలల అభివృద్ధి ప్రస్థానం సాగిందన్నారు. -
ఘనంగా జయశంకర్ జయంతి
నర్సంపేట: డివిజన్ వ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్ చిత్రపటానికి రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రాయిడి రవీందర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, వైస్ చైర్మన్ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ గుంటి కిషన్, నాయిని నర్సయ్య, పుట్టపాక కుమారస్వామి, నాగిశెట్టి ప్రసాద్, జ్ఞాన్‌సాగర్, కామగోని శ్రీనివాస్, బండి ప్రవీణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే టీజేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీజేఏసీ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బోనగాని రవీందర్, జిల్లా కోఆర్డినేటర్ షేక్‌జావెద్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, సాంబరెడ్డి, రవి, యాకుబ్, కమల్ పాల్గొన్నారు. -
జయశంకర్ సార్‌కు నివాళి
ఘనంగా 83వ జయంతి ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఆదివారం జిల్లా అంతటా ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లోగల జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ జయశంకర్ సార్ చూపిన బాటలో నడవాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మార్గదర్శకునిగా ఉన్న ఆయన స్వరాష్ట్రం ఏర్పడ్డాక లేకపోవడం బాధాకరమన్నారు. ప్రతిఒక్కరూ ప్రొఫెసర్ ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, నాయకులు గంగారెడ్డి, నారాయణ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. ఆదిలాబాద్‌అర్బన్: జయశంకర్ సార్ జయంతిని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఆర్వో బానోత్ శంకర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర సాధనకు అహర్నిషలు కృషి చేసిన జయశంకర్ సార్‌ను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏవో సంజయ్‌కుమార్, పర్యవేక్షకులు సుశీల, ఇన్చార్జి డీసీఎస్వో తనూజ పాల్గొన్నారు. పోలీస్ క్యాంపు కార్యాలయంలో.. ఆదిలాబాద్: పోలీసు క్యాంప్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ఎం.శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మ రువలేనిదన్నారు. స్పెషల్‌బ్రాంచ్ ఎస్సైలు అన్వర్ ఉల్‌హఖ్, రామన్న, సీసీ పోతరాజు, ఫింగర్‌ప్రింట్ అధికా రి అశోక్‌కుమార్, సిబ్బంది కృష్ణమూర్తి, ప్రకాశ్‌రెడ్డి, అ బ్దుల్లా, సత్యనారాయణ, షకీల్, వెంకట్ పాల్గొన్నారు.