ఘనంగా జయశంకర్‌ జయంతి | Jayasankar Jayanti as the crown | Sakshi
Sakshi News home page

ఘనంగా జయశంకర్‌ జయంతి

Published Tue, Aug 8 2017 12:38 AM | Last Updated on Sun, Sep 17 2017 5:16 PM

ఘనంగా జయశంకర్‌ జయంతి

ఘనంగా జయశంకర్‌ జయంతి

నర్సంపేట: డివిజన్‌ వ్యాప్తంగా జయశంకర్‌ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జయశంకర్‌ చిత్రపటానికి రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో రాయిడి రవీందర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్‌ నాగెల్లి వెంకటనారాయణ, వైస్‌ చైర్మన్‌ మునిగాల పద్మవెంకట్‌రెడ్డి, ఫ్లోర్‌ లీడర్‌ గుంటి కిషన్, నాయిని నర్సయ్య, పుట్టపాక కుమారస్వామి, నాగిశెట్టి ప్రసాద్, జ్ఞాన్‌సాగర్, కామగోని శ్రీనివాస్, బండి ప్రవీణ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

అలాగే టీజేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని టీజేఏసీ కార్యాలయంలో జయశంకర్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బోనగాని రవీందర్, జిల్లా కోఆర్డినేటర్‌ షేక్‌జావెద్, రాజశేఖర్, వెంకటేశ్వర్లు, సాంబరెడ్డి, రవి, యాకుబ్, కమల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement