మే19న దిగ్విజయ్ కుమారుడి పెళ్లి
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జయవర్ధన్ సింగ్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీలో అతిపిన్న వయస్కుడిగా (28 ఏళ్లు) గుర్తింపు పొందిన జయవర్ధన్ మే 19వ తేదీన పెళ్లి చేసుకుంటున్నానని మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఆయన 14వ విధాన సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున రఘోగఢ్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన విషయం తెల్సిందే. దుమారియాలోని (బీహార్) షాహి రాజవంశానికి చెందిన శ్రీజామ్య షాహిని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె ప్రస్తుతం అజ్మీర్‌లోని మహిళా కళాశాలలో సీఏ చదువోతోందని జయవర్ధన్ తెలిపారు. కొంతకాలంగా ఆయన పెళ్లిపై ఊహాగానాలు చెలరేగుతున్నప్పటికీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఇంతవరకు వాటిని ధ్రువీకరించలేదు.