jc meeting
-
నగదు రహిత లావాదేవీలు జరగాలి
అనంతపురం అర్బన్ : జిల్లాలో నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్షీ్మకాంతం ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ చౌక దుకాణాల్లో నగదు రహిత లావా దేవీలు జరిపేందుకు పెం డింగ్‌లో ఉన్న 200 డీలర్ల ఖాతాలను వెంటనే మ్యాపింగ్ చేయా లన్నారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల అభ్యర్థన మేరకు ఈ–పాస్ యం త్రాల ను ఎస్బీఐ సరఫరా చేయా లన్నారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత బ్యాంకులు ఒక కరెంట్ ఖాతాను ప్రారంభించాన్నారు. వినతులు పరిష్కరించకుంటే చర్యలు అనంతపురం అర్బన్ : ‘ప్రజలు తమ సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని నమ్మ కంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీలిస్తుంటారు..వాటిని గడువుదాటినా పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జేసీ బి.లక్షీ్మకాంతం హెచ్చరించారు. మంగâýæవారం ఆయన తన చాంబర్లో ‘మీ కోసం’ పెండింగ్ అర్జీలపై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో అధికంగా పౌర సరఫరాల శాఖలో 6,764 అర్జీలు, గనులు భూగర్భ శాఖకు సంబంధించి 1,549, పరిశ్రమల శాఖలో 1,549, వ్యవసాయ శాఖలో 1,065, విద్యుత్ శాఖలో 1,430, మునిసిపల్ అడ్మినిస్ట్రేష¯ŒSలో 1,139 అర్జీలు గడువు దాటినా పరిష్కారం కాలేదన్నారు. -
టపాసులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
జేసీ ఇంతియాజ్ నెల్లూరు (పొగతోట) : దీపావళి టపాసులు అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఏ మహమ్మద్ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. లైసెన్స్‌లు లేకుండా టపాసులు విక్రయించే వారి షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలన్నారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు నిబంధనల ప్రకారం విక్రయాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దుకాణాల నిర్వహణలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలు అనుమతులు తప్పని సరిగా పొందలన్నారు. దుకాణాల వద్ద వాటర్ డ్రమ్ము, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. షాపుల మధ్య 15 అడుగుల దూరం ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దుకాణాల వద్ద ప్రజలు అధికంగా గుమిగుడకుండా, చిన్నపిల్లలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించి దుకాణాలు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డీఆర్ఓ మార్కండేయులు, కావలి ఆర్డీఓ నరసింహం, నెల్లూరు డీఎస్పీ వెంకటరాయుడు, జిల్లా అగ్నిమాక శాఖ అధికారి ఆర్. జ్ఞానసుందరం, కలెక్టరేట్ పరిపాలనాధికారి మధుసూదనశర్మ, నెల్లూరు తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, హోల్‌సేల్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
‘మద్దతు’ తేలేనా?
సాక్షి, సంగారెడ్డి: చెరకు మద్దతు ధరపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగడం లేదు. చెరకు సీజన్ ఆరంభానికి ముందే ధర ఖరారు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా, వారు కోరినంత ధర చెల్లించడం సాధ్యం కాదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెబుతున్నాయి. టన్ను చెరకుకు రూ.3,500 ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, అంత మొత్తం చెల్లిస్తే తమకు నష్టాలు తప్పవని చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు చెబుతున్నాయి. మద్దతు ధర ఖరారు కానప్పటికీ సంగారెడ్డి మండలంలోని గణపతి షుగర్స్ గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించనుంది. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ సైతం క్రషింగ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు మద్దతు ధర అంశంపై రైతులు పట్టును బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మద్దతు ధరపై గణపతి షుగర్స్‌తో రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి జేసీ శరత్ ను కలిసి మద్దతు ధర విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జేసీ శరత్ గురువారం జిల్లాలోని మూడు చక్కెర పరిశ్రమల యాజమాన్యాలు, చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చెరకు రైతుల దృష్టంతా గురువారం జరగనున్న చర్చలపై పడింది. జేసీతో జరిగే చర్చల్లో తాము ఆశించిన మద్దతు ధర ఖరారు అవుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు... చెరకు మద్దతు ధర ఖరారుపై మూడేళ్లుగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందే తాము కోరిన మేర మద్దతు ధర చెల్లించాలని పట్టుబట్టడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు నిరాకరించడం జరుగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో రైతులు చెరకు ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలకు సైతం దిగారు. కాగా ఈ ఏడాది చెరకు రైతులు టన్నుకు రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. గతంలో కంటే సాగు వ్యయం పెరగడం, వర్షాభావం, కరెంటు కోతల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులు తాము ఆశించిన ధర చెల్లించాలని కోరుతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం రూ.2,600 చెల్లించేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.