JC Sadda
-
మోడీ పరిపాలన దక్షతకే ఓటు: సద్దా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పరిపాలన దక్షతకే ప్రజలు ఓటు వేశారని బీజేపీ ప్రధాన కార్యదర్శి జేసీ సద్దా అన్నారు. శివసేన, ఎన్సీపీలలో ఎవరి నుంచి మద్దతు స్వీకరించాలనే అంశంపై ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు సుదీర్ఘంగా చర్చించారు. మహారాష్ట్ర పరిశీలకులుగా వెంకయ్యనాయుడు, దినేష్ శర్మలను బీజేపీ అధిష్టానం పంపించాలని నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో విజయాన్ని కట్టబెట్టినందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. -
ఉద్దవ్ థాక్రేకు ఫోన్ చేయలేదు: బీజీపీ
ముంబై: ఉద్ధవ్ థాక్రేకు ఫోన్ చేయలేదని బీజేపీ ప్రధాన కార్యదర్శి జేసీ సద్దా తెలిపారు. తొలుత శాసన సభా పక్షనేతను ఎంపిక చేస్తామని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. అలాగే ఉద్ధవ్ నుంచి మాకు ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. ఎన్సీపీ మద్దతు ఇస్తామని ముందుకు వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్సీపీ, శివసేన మద్దతుపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందన్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ పరిపాలన దక్షతకే ప్రజలు ఓటు వేశారని సద్దా అన్నారు.