jeep over turned
-
తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా
తిరుపతి :తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం ఓ జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో 9 మంది అనంతపురం జిల్లాకు చెందిన భక్తులు కాగా, మరో ఇద్దరు తిరుపతి వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి తిరుపతికి వస్తుండగా ఘాట్ రోడ్డులోని జింకలపార్కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. -
జీపు బోల్తా: కానిస్టేబుల్ మృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల మండలం దుప్పిలిపాలెం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్పీ బెటాలియన్ జీపు ప్రమాదవశాత్తూ అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.