క్రిస్టియన్ భవన్ పై బజరంగ్ దళ్ దాడి
పాట్నా: బీహార్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాజధాని పాట్నాకు 52 కిలోమీటర్ల దూరంలో జెహనాబాద్ పట్టణంలో క్రిస్టియన్ భవన్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. పేద హిందులను క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారనే ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
బజరంగ్ దళ్ దాడితో క్రైస్తవులు భయాందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.