jersey unveiled
-
IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీ ఎలా ఉందో చూడండి..!
త్వరలో (మార్చి 22) ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త జెర్సీని ఇవాళ (మార్చి 7) విడుదల చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి జెర్సీ కొంచం కొత్తగా కనిపిస్తుంది. కొత్త జెర్సీతో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫోటోలకు పోజులిచ్చాడు. కొత్త జెర్సీ విషయాన్ని రివీల్ చేస్తూ భువీ ఫోటోనే సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. హైదరాబాద్ వేడిని బయటపెట్టడానికి సిద్దం.. ఐపీఎల్ 2024 కోసం మా జ్వలించే కవచం అంటూ క్యాప్షన్లు జోడించింది. సన్‌రైజర్స్ కొత్త జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయగలరు. Ready to unleash the fiery heat of Hyderabad 🔥 Our 🆕 blazing armour for #IPL2024 🧡 #PlayWithFire pic.twitter.com/mMQ5SMQH6O — SunRisers Hyderabad (@SunRisers) March 7, 2024 ఇదిలా ఉంటే, రానున్న ఐపీఎల్ సీజన్ కోసం ఆరెంజ్ ఆర్మీ ఇదివరకే సన్నాహకాలను మొదలుపెట్టింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్‌ను షురూ చేసింది. మిగిలిన ఆటగాళ్లు కూడా ఒక్కొక్కరుగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంప్‌కు చేరుకుంటున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. ఈ విడతలో సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. 𝑺𝒑𝒊𝒏𝒏𝒊𝒏𝒈 things around a little with this #FlameComing 💫 Welcome back home, Mayank 🧡 pic.twitter.com/LduWWXa89n — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 #FlameComing season just got better with the O̶G̶ AG 🔥 Welcome home, Mayank 🧡 pic.twitter.com/uOyYxiTl1u — SunRisers Hyderabad (@SunRisers) March 6, 2024 ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23వ తేదీన ఆడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ లోకల్ టీమ్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. మార్చి 27న ముంబై ఇండియన్స్‌తో, మార్చి 31 గుజరాత్ టైటాన్స్‌తో, ఏప్రిల్ 5 చెన్నై సూపర్‌కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. వీటిలో ముంబై ఇండియన్స్, సీఎస్కే మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగనుండగా.. గుజరాత్‌తో మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. First team huddle of the season at Uppal ft. a whole lotta orange 🥹🧡 pic.twitter.com/JV4dvzwicE — SunRisers Hyderabad (@SunRisers) March 5, 2024 కొద్ది రోజుల కిందటే సన్‌రైజర్స్ యాజమాన్యం పాత కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ను తప్పించి పాట్ కమిన్స్‌ను నూతన కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఈ సీజన్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో సన్‌రైజర్స్ టీమ్ చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అన్ని విభాగాల్లో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కళకళలాడుతుంది. సన్‌రైజర్స్ జట్టు వివరాలు.. అబ్దుల్ సమద్ బ్యాటర్ 4 కోట్లు రాహుల్ త్రిపాఠి బ్యాటర్ 8.5 కోట్లు ఎయిడెన్ మార్క్రమ్ బ్యాటర్ 2.6 కోట్లు గ్లెన్ ఫిలిప్స్ బ్యాటర్ 1.5 కోట్లు హెన్రిచ్ క్లాసెన్ బ్యాటర్ 5.25 కోట్లు మయాంక్ అగర్వాల్ బ్యాటర్ 8.25 కోట్లు ట్రావిస్ హెడ్ బ్యాటర్ 6.8 కోట్లు అన్మోల్ప్రీత్ సింగ్ బ్యాటర్ 20 లక్షలు ఉపేంద్ర యాదవ్ వికెట్ కీపర్ 25 లక్షలు షాబాజ్ అహ్మద్ ఆల్ రౌండర్ 2.4 కోట్లు నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండర్ 20 లక్షలు అభిషేక్ శర్మ ఆల్ రౌండర్ 6.5 కోట్లు మార్కో జాన్సెన్ ఆల్ రౌండర్ 4.2 కోట్లు వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్ 8.75 కోట్లు సన్వీర్ సింగ్ ఆల్ రౌండర్ 20 లక్షలు పాట్ కమిన్స్ బౌలర్ 20.5 కోట్లు (కెప్టెన్) భువనేశ్వర్ కుమార్ బౌలర్ 4.2 కోట్లు టి నటరాజన్ బౌలర్ 4 కోట్లు వనిందు హసరంగా బౌలర్ 1.5 కోట్లు మయాంక్ మార్కండే బౌలర్ 50 లక్షలు ఉమ్రాన్ మాలిక్ బౌలర్ 4 కోట్లు ఫజల్హాక్ ఫరూకీ బౌలర్ 50 లక్షలు జయదేవ్ ఉనద్కత్ బౌలర్ 1.6 కోట్లు ఆకాశ్ సింగ్ బౌలర్ 20 లక్షలు ఝటావేద్ సుబ్రమణ్యం బౌలర్ 20 లక్షలు -
WTC Final: టీమిండియా కొత్త జెర్సీల ఆవిష్కరణ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్‌కు ఆరు రోజుల ముందు టీమిండియా కొత్త జెర్సీ విడుదలైంది. భారత జట్టు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అడిడాస్ సంస్థనే టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది. నైక్ కంపెనీ తర్వాత కిట్ స్పాన్సరే (అడిడాస్) జెర్సీని తయారు చేయడం ఇదే మొదటిసారి. మూడు ఫార్మట్లకు చెందిన భారత జట్టు జెర్సీలను అడిడాస్ సంస్థ ఇవాళ (జూన్ 1) సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఆవిష్కరించి, అభిమానులతో షేర్ చేసుకుంది. An iconic moment, An iconic stadiumIntroducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Adidas India (@adidasindiaoffi) June 1, 2023 జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి రూపొందించిన ప్రత్యేక యానిమేటెడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. కొత్త జెర్సీలను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. టీమిండియా కొత్త జెర్సీలు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో పాత జెర్సీలకు కొత్త వాటికి తేడా లేదని పెదవి విరుస్తున్నారు. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్లో ఉండే జెర్సీ టీ20లకు.. లైట్ బ్లూ కలర్లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు.. వైట్ కలర్ జెర్సీని టెస్ట్‌లకు టీమిండియా ఆటగాళ్లు ధరించనున్నారు. ఇదిలా ఉంటే, జూన్ 7న ఆసీస్‌తో ప్రారంభంకాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. పురుషుల క్రికెట్‌తో పాటు మహిళల క్రికెట్లోనూ భారత ఆటగాళ్లు ఇవే జెర్సీలు ధరించనున్నారు. బైజూస్ సంస్థ బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను (జెర్సీ స్పాన్సర్) అర్ధంతరంగా రద్దు చేసుకోవడంతో అడిడాస్ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో జెర్సీ స్పాన్సర్‌గా కూడా వ్యవహరించింది.ఔ చదవండి: WTC Final: ఆసీస్‌కు అక్కడ అంత సీన్ లేదు.. గెలుపు టీమిండియాదే..! -
టీమిండియా కొత్త జెర్సీ వచ్చేసింది.. 2007 కిట్‌కు దగ్గరగా..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొద్ది సేపటి కిందట టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ జెర్సీని టీ20 వరల్డ్ కప్ 2022 కోసం రూపొందించినప్పటికీ.. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్ నుంచే భారత ఆటగాళ్లు ధరిస్తారని బీసీసీఐ పేర్కొంది. టీమిండియా అఫీషియల్ కిట్ స్పాన్సర్ ఎంపీఎల్ కన్ఫర్మ్ చేసిన జెర్సీకే బీసీసీఐ యధాతథంగా ఆమోదం తెలిపింది. To every cricket fan out there, this one’s for you. Presenting the all new T20 Jersey - One Blue Jersey by @mpl_sport. #HarFanKiJersey#TeamIndia #MPLSports #CricketFandom pic.twitter.com/3VVro2TgTT — BCCI (@BCCI) September 18, 2022 ఆసియా కప్ 2022లో భారత ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే, కొత్త కిట్‌లో కొద్దిగా నీలిరంగు షేడ్ ఉంది. చేతులు, షోల్డర్ డార్క్ బ్లూ కలర్లో ఉండగా.. జెర్సీపై గీతలు వచ్చాయి. ఇది 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత జెర్సీకి దగ్గరగా ఉంది. 2020లో ఎంపీఎల్-బీసీసీఐల మధ్య ఒప్పందం కుదిరాక రూపొందించబడ్డ మూడో జెర్సీ ఇది. కాగా, మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమిస్తారు. -
IPL 2022: లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీ ఇలా ఉండనుందా..?
ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)కు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ ఫ్రాంచైజీ జెర్సీ అధికారికంగా విడుదల కాకముందే లీకులకు గురై వార్తల్లో నిలిచింది. ప్రముఖ ర్యాపర్ బాద్షాతో ఓ ప్రమో సాంగ్ రూపొందించిన ఎల్ఎస్జీ.. నేడో, రేపో జెర్సీని లాంచ్ చేయాలని భావించగా, ఈ లోపే జెర్సీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. #LucknowSuperGiants HERE-WE-GO, leaked footage of the ongoing shoot of @LucknowIPL theme song featuring @Its_Badshah. 🎶📹 #JerseyReveal 👀💙🧡#WeAreSuperGiants | #IPL2022#TATAIPL2022 #TataIPL #IPL pic.twitter.com/DSekgZmyNE — SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) March 9, 2022 ఈ ఫోటోల్లో బాద్షా.. లైట్ స్కై బ్లూ కలర్, భుజాల దగ్గర ఆరెంజ్ కలర్ షేడ్‌తో ఉన్న జెర్సీని ధరించి ఉన్నాడు. ఇదే ఎల్ఎస్జీ అఫిషియల్ జెర్సీ అని ఫ్రాంచైజీ అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ఫోటోల్లో బాద్షా ఎల్ఎస్జీ లోగోను చేతబట్టి స్టెప్పులేస్తుండటం అభిమానల అనుమానికి బలం చేకూరుస్తుంది. లక్నో జెర్సీ ఇదే అని ఫిక్స్ అయిపోయిన అభిమానులు కొత్త జెర్సీతో సందడి చేస్తున్నారు. Badshah might be working on Lucknow Super Giants theme song for IPL 2022!#KLRahul | #LucknowSuperGiants | #IPL2022 pic.twitter.com/cYU95UtaIA — Kunal Yadav (@kunaalyaadav) March 9, 2022 ఇదిలా ఉంటే, ఎల్ఎస్జీతో పాటు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో జట్టు గుజరాత్ టైటాన్స్ కూడా జెర్సీని లాంచ్ చేయాల్సి ఉంది. టైటాన్స్ జట్టు ఈ ఆదివారం (మార్చి 13) నరేంద్ర మోడీ స్టేడియంలో జెర్సీని గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తుంది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేఎల్ రాహుల్‌ను, అహ్మదాబాద్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యాను తమతమ జట్ల కెప్టెన్లుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న ఈ రెండు జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(17 కోట్లు), స్టోయినిస్ (9.20 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), డికాక్ (6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), ఎవిన్ లూయిస్ (2 కోట్లు), దుశ్మంత చమీర (2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కైల్ మేయర్స్ (50 లక్షలు), మోసిన్‌ఖాన్ (20 లక్షలు), ఆయుశ్ బదోని (20 లక్షలు), కరణ్ సన్నీ శర్మ (20 లక్షలు), మయాంక్ యాదవ్ (20 లక్షలు), మనన్ వోహ్రా (20 లక్షలు) చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..! -
ఒలింపిక్స్ జెర్సీలను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: జులై 23 నుంచి ప్రారంభంకానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్లు సన్నద్దం అవుతున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు.. భారత అథ్లెట్ల జెర్సీలను, అలాగే సహాయ సిబ్బంది యూనిఫాంలను ఆవిష్కరించారు. అథ్లెట్ల కోసం నీలం, తెలుపు రంగులలో జెర్సీలు డిజైన్ చేయబడగా, సపోర్ట్ స్టాఫ్ కోసం ప్రత్యేక సూట్లు రూపొందించబడ్డాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం గతేడాది(2020) జరగాల్సిన విశ్వక్రీడలు.. ఈ ఏడాది జులైకి రీషెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, అంతకముందే ఒలింపిక్స్క్రీడల సంసిద్దతపై ప్రధాని మోదీ.. క్రీడల మంత్రితో సమీక్ష నిర్వహించారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులందరికి వ్యాక్సినేషన్, సరైన శిక్షణ, ఇతర సదుపాయాల గురించి చర్చించారు. క్రీడాకారులకు సరైన ప్రోత్సాహకాలనివ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ సంస్కృతికి క్రీడలు హృదయం లాంటివని, మన దేశ యువత బలమైన, తేజోవంతమైన క్రీడా సంస్కృతిని సృష్టిస్తున్నారని అభినందించారు. విశ్వక్రీడల్లో పాల్గొనే అథ్లెట్ల వెంట 135 కోట్ల దేశ ప్రజల దీవెనలుంటాయని, టోక్యోకు వెళ్లే భారత బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, టోక్యోలో జరగబోయే ఒలింపిక్స్ కోసం మన దేశం నుంచి 11 క్రీడా విభాగాల్లో మొత్తం 100 మంది అథ్లెట్లు పాల్గొంటారు. జూన్చివరి నాటికి ఆ సంఖ్య 125కి పెరిగే అవకాశం ఉంది. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
'నేను ఎప్పుడూ ఎల్లో కలర్‌ను నమ్ముతాను'
తిరువనంతపురం : మా జట్టు చాలా పటిష్టమైనది, నైపుణ్యం గల ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని క్రికెట్ దిగ్గజ ఆటగాడు, కేరళ బ్లాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ ఆటకు ఐపీఎల్ ఉన్నట్లే, గతేడాది ఫుట్‌బాల్ మ్యాచ్‌లకోసం ఐఎస్ఎల్ లీగ్ ప్రారంభిన విషయం విదితమే. 2014లో జరిగిన ఐఎస్ఎల్ మ్యాచ్‌ల్లో సచిన్ జట్టు కేరళ రన్నరప్‌గా నిలిచింది. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ స్పాన్సర్ల సమక్షంలో సచిన్ తన జట్టు ఆటగాళ్ల జెర్సీని ఆవిష్కరించారు. పసుపు రంగు జెర్సీని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. 'నేను ఎల్లో కలర్‌ను విశ్వసిస్తాను. గతేడాది లీగ్ ఆరంభానికి ముందు మా ఆటగాళ్ల నైపుణ్యం గురించి ఎవరికీ తెలియదు. సీజన్ ముగిశాక వారి ప్రతిభ బయటపడింది'అని సచిన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మా జట్టు మరిన్ని మంచి ఫలితాలు రాబడుతుందని, మీ సహకారం, ప్రేమ కావాలంటూ సచిన్ అభిమానులను కోరాడు. ముత్తూట్ పప్పాచాన్ గ్రూప్ ఈ సీజన్లో ఆ జట్టుకు ప్రధాన స్పాన్సరర్. ఈ సీజన్ తొలి మ్యాచ్ కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య అక్టోబర్ 6న జరుగుతుందన్న విషయం విదితమే.