ఈ ఏడాది ఐపీఎల్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)కు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. ఈ ఫ్రాంచైజీ జెర్సీ అధికారికంగా విడుదల కాకముందే లీకులకు గురై వార్తల్లో నిలిచింది. ప్రముఖ ర్యాపర్ బాద్షాతో ఓ ప్రమో సాంగ్ రూపొందించిన ఎల్‌ఎస్‌జీ.. నేడో, రేపో జెర్సీని లాంచ్ చేయాలని భావించగా, ఈ లోపే జెర్సీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
#LucknowSuperGiants
— SuperGiantsArmy™ — LSG FC (@LucknowIPLCover) March 9, 2022
HERE-WE-GO, leaked footage of the ongoing shoot of @LucknowIPL theme song featuring @Its_Badshah. 🎶📹 #JerseyReveal 👀💙🧡#WeAreSuperGiants | #IPL2022#TATAIPL2022 #TataIPL #IPL pic.twitter.com/DSekgZmyNE
ఈ ఫోటోల్లో బాద్షా.. లైట్ స్కై బ్లూ కలర్, భుజాల దగ్గర ఆరెంజ్ కలర్ షేడ్‌తో ఉన్న జెర్సీని ధరించి ఉన్నాడు. ఇదే ఎల్‌ఎస్‌జీ అఫిషియల్ జెర్సీ అని ఫ్రాంచైజీ అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ఫోటోల్లో బాద్షా ఎల్ఎస్‌జీ లోగోను చేతబట్టి స్టెప్పులేస్తుండటం అభిమానల అనుమానికి బలం చేకూరుస్తుంది. లక్నో జెర్సీ ఇదే అని ఫిక్స్ అయిపోయిన అభిమానులు కొత్త జెర్సీతో సందడి చేస్తున్నారు.
Badshah might be working on Lucknow Super Giants theme song for IPL 2022!#KLRahul | #LucknowSuperGiants | #IPL2022 pic.twitter.com/cYU95UtaIA
— Kunal Yadav (@kunaalyaadav) March 9, 2022
ఇదిలా ఉంటే, ఎల్‌ఎస్‌జీతో పాటు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న మరో జట్టు గుజరాత్ టైటాన్స్ కూడా జెర్సీని లాంచ్ చేయాల్సి ఉంది. టైటాన్స్ జట్టు ఈ ఆదివారం (మార్చి 13) నరేంద్ర మోడీ స్టేడియంలో జెర్సీని గ్రాండ్‌గా లాంచ్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తుంది. కాగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కేఎల్ రాహుల్‌ను, అహ్మదాబాద్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యాను తమతమ జట్ల కెప్టెన్లుగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. మార్చి 28న ఈ రెండు జట్లు వాంఖడే వేదికగా తలపడనున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్(17 కోట్లు), స్టోయినిస్ (9.20 కోట్లు), అవేశ్ ఖాన్ (10 కోట్లు), హోల్డర్ (8.75 కోట్లు), కృనాల్ పాండ్యా (8.25 కోట్లు), మార్క్ వుడ్ (7.50 కోట్లు), డికాక్ (6.75 కోట్లు), దీపక్ హుడా (5.75 కోట్లు), మనీశ్ పాండే (4.60 కోట్లు), రవి బిష్ణోయ్ (4 కోట్లు), ఎవిన్ లూయిస్ (2 కోట్లు), దుశ్మంత చమీర (2 కోట్లు), కృష్ణప్ప గౌతమ్ (90 లక్షలు), అంకిత్ రాజ్‌పుత్ (50 లక్షలు), షాబాజ్ నదీమ్ (50 లక్షలు), కైల్ మేయర్స్ (50 లక్షలు), మోసిన్‌ఖాన్ (20 లక్షలు), ఆయుశ్ బదోని (20 లక్షలు), కరణ్ సన్నీ శర్మ (20 లక్షలు), మయాంక్ యాదవ్ (20 లక్షలు), మనన్ వోహ్రా (20 లక్షలు)
చదవండి: బీసీసీఐ ద్వంద్వ వైఖరి.. కోహ్లి విషయంలో అలా, రోహిత్ కోసం ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment