jewellery store
-
Kajal Aggarwal : కూకట్‌పల్లిలో సందడి చేసిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
నగల దుకాణంలో సినీ నటి మంచు లక్ష్మి సందడి (ఫోటోలు)
-
Shriya Saran: పంజాగుట్టలో నటి శ్రియ సందడి (ఫొటోలు)
-
పంజాగుట్టలోని ఓ జ్యువెలరీ ప్రారంభోత్సవంలో బిగ్బాస్ఫేమ్ దివి సందడి (ఫోటోలు)
-
దుబాయ్‌లో దోపిడీ: దొరికిన దొంగలు
దుబాయ్ : దుబాయ్ నగరంలో బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది జులైలో ఓ జ్యువెల్లరీ షాపులోకి వెళ్లిన ఐదుగురు ముసుగు దొంగలు కత్తులు, పెప్పర్ స్ప్రేలతో ఉద్యోగులను బెదిరించారు. వారిని వాష్రూమ్స్లోకి పంపి డోర్స్ లాక్ చేశారు. అనంతరం 1.5 మిలియన్ల దిర్హమ్ల విలువైన బంగారాన్ని దోచుకుని కారులో పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కారు ప్లేట్ నంబర్‌ను గుర్తించి విచారణను ప్రారంభించారు. చిన్న చితకా సమాచారంతో పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు ఆప్ఘనిస్తాన్‌కు చెందిన వారిగా గుర్తించి అరెస్టు చేశారు. అనంతరం వారిని స్థానిక కోర్టులో హాజరుపర్చారు. -
యజమానులే దొంగలయ్యారు..
చండీగఢ్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యజమానులే దొంగలుగా మారారు. తమ నగల దుకాణంలో దోపిడీ చేయించి పోలీసులకు దొరికిపోయారు. చండీగఢ్‌లో ఈ ఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. వినోద్, రజనీష్ వర్మ అనే సోదరులు నగల దుకాణం నిర్వహిస్తున్నారు. జ్యువెలరీ షాపులోని 14 కోట్ల రూపాయల విలువైన నగలకు 10 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. అక్రమమార్గంలో ఇన్సూరెన్స్ డబ్బులు క్లైమ్ చేసుకోవాలని దురాశపడ్డ వర్మ సోదరులు దోపిడీకి పథకం పన్నారు. దొంగతనం చేయడానికి తమ బంధువులనే రంగంలోకి దింపారు. శనివారం ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి జ్యువెలరీ షాపునకు వచ్చి ఉంగరం కోసం ఆర్డర్ ఇచ్చారు. మరుసటి రోజు ఆదివారం ముగ్గురు వచ్చి తుపాకీతో బెదిరించి సెక్యూరిటీ గార్డు, స్టాఫ్‌ను ఓ రూమ్‌లో బంధించి నగలు దోచుకెళ్లారు. ఆధారాలు లేకుండా చేసేందుకు సీసీటీవీలో మెమొరీ కార్డును తొలగించారు. తమ పథకం అమలు చేసిన వర్మ సోదరులు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇద్దరూ ఆస్పత్రిలో చేరారు. పోలీసులు వర్మ సోదరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.