Jewels of asia
-
జ్యువెల్స్ షోలో నటీమణులు సందడి (ఫొటోలు)
-
ధగధగలాడే నగలు.. నిగనిగలాడే భామలు
ధగధగలాడే నగలతో నిగనిగలాడే భామలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సందడి చేశారు. జ్యువెల్స్ ఆఫ్ ఏషియా ప్రదర్శన శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ తారలు మీనాక్షి దీక్షిత్, నేహాలుల్లా, మిసెస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రత్యేకంగా రూపొందించిన నగలు ధరించి వేదికపై కనువిందు చేశారు. ఆభరణాల ప్రదర్శనలో దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన ‘క్రివిష్ విజన్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం వరకు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌సలో నూతనంగా ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో కూడా మీనాక్షిదీక్షిత్ తళుక్కుమంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నటుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. - ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
జ్యువెల్స్ ఆఫ్ ఏషియా
అతివలకు అందంతోపాటు ఆత్మవిశ్వాసాన్నివ్వడంలో ఆభరణాలది ప్రధాన పాత్ర అంటున్నారు మిస్సెస్ ప్లానెట్ మెహక్‌మూర్తి. ‘జ్యువెల్స్ ఆఫ్ ఏషియా’ పేరిట ఆగస్టు ఒకటి నుంచి మూడు రోజుల పాటు హోటల్ తాజ్ కృష్ణాలో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్యాలయుంలో బుధవారం జరిగిన కార్యక్రవుంలో ఎగ్జిబిషన్ వివరాలను నిర్వాహకులతో కలిసి ఆమె వివరించారు. ఈ సందర్భంగా అందాల తార మీనాక్షిదీక్షిత్... జ్యువెలరీ ధరించి తళుక్కువుంది. ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన ఐదు వేలకు పైగా డిజైన్లను ఈ ప్రదర్శనలో ప్రదర్శించనున్నారు. - సాక్షి, సిటీప్లస్