కిడ్నాప్ అయిన బాలుడు.. జీఆర్పీ చెంతకు
సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్‌లో కిడ్నాప్‌నకు గురైన బాలుడు దాదర్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జీఆర్పీకి దొరికాడు. పోలీసులకు అతడు అందించిన వివరాలిలా ఉన్నాయి... బాలుడు ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తన స్నేహితునికి నోట్‌బుక్ ఇవ్వడానికి వెళ్తుండగా, ఓ నల్లని వాహనంలో నలుగురు వ్యక్తులు వచ్చి బాలుడ్ని ఎత్తుకుపోయారు.
అనంతరం బాలుడ్ని రైల్లో ముంబైలోని కల్యాణ్‌కు తీసుకు వచ్చి వెదురుకట్టెలు గుట్టలుగుట్టలుగా ఉన్న ఒక రహస్య ప్రదేశంలో ఉంచారు. కాగా, శుక్రవారం పిల్లాడితోపాటు కిడ్నాపర్లు లోకల్ రైలులో దాదర్ స్టేషన్‌కు వచ్చా రు. ఆ సమయంలో వారి కళ్లుగప్పి తాను తప్పించుకుని వచ్చానని సదరు బాలుడు జీఆర్పీ పోలీసులకు తెలిపాడు.
బాలుడు అందించిన సమాచారం ప్రకారం, ఉత్తర ప్రదేశ్‌లోని సిప్రి బజార్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చామని ఇన్స్పెక్టర్ బాలాసాహెబ్ బాన్కర్ తెలిపారు. బాలుని కిడ్నాప్ అయిన విషయాన్ని బాలుని తల్లిదండ్రులతోపాటు ఉత్తరప్రదేశ్ పోలీసు లు ధృవీకరించారు. కానీ కిడ్నాపింగ్ కారణాలు తెలియలేదని పోలీసులు తెలిపారు.