కూలీ డబ్బులతో చదివించా..
జార్ఖండ్ రాష్ట్ర ఐఏఎస్ అధికారి డి.ఆంజనేయులు తల్లి మణెమ్మకు మాతృవందనం విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీ పనులు చేస్తూ తన కుమారుడిని ఐఏఎస్ చదివించానని తెలిపారు. తన కొడుకు కూడా పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడని మురిసిపోయారు.