సెలవుల్లో మావయ్య ఇంట్లో గడిపేందుకు వెళ్లి..
వడోదర: వేసవి సెలవుల్లో తన అంకుల్ ఇంటివద్ద గడిపేందుకు వెళ్లిన ఎనిమిదేళ్ల బాలిక జీవితం విషాధంగా మారింది. తన మేనమామ పొలంలో ఆడుకుంటున్న జిగ్నా గోహిల్ అనే బాలికపై చిరుతపులి దాడి చేసి చీరేసింది. తీవ్రగాయాలతో ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్లోని సోమనాథ్ గిర్ జిల్లాలోగల సనాఖడ అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోమవారం సాయంత్రం తన మావయ్య పొలంలోని మామిడితోటలో ఆడుకునేందుకు వెళ్లిన బాలికపై ఓ చిరుత దాడి చేసి చంపేసింది. రాత్రి సమయంలో కూడా బాలిక రాకపోవడంతో వెతికి చూడగా చిరుత దాడి చేసిన విషయం తెలిసింది. తీవ్రగాయాలతో ఉన్న బాలిక ప్రాణాలతో ఉందేమోనన్న ఆశతో ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.