‘కరెన్సీ నోటుపై అంబేడ్కర్ బొమ్మ ముద్రించాలి’
మహబూబ్నగర్: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిలకర బాలీశ్వరయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన చర్చావేదిక సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అంబేడ్కర్ చిత్రపటాన్ని నాణేల పైనే కాకుండా కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.