JioPhone Pre-bookings
-
జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీయనుంది. ప్రపంచంలో 'అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్' జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10న ముఖేష్ అంబానీ మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ కొనేందుకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్‌కి సంబంధించి డిమాండ్ ఆకాశాన్ని తాకుతోంది. దీంతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈ ఫోన్‌కి ఈ ఫోన్‌కి ప్రీ బుకింగ్స్ పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆరోజు చెప్పిన ముఖేష్ జూన్ నెలలో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో(ఏజీఎం)లో ముకేష్ అంబానీ జియోఫోన్ నెక్ట్స్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈఫోన్ ఫీచర్లు, కాస్ట్ ఎంత అనే అంశాలపై ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. కొద్ది రోజుల క్రితమే పేర్కొన్నట్లు ఈ ఫోన్ రూ.3,500 ధరకు తీసుకోని వస్తున్నట్లు మొబైల్‌మార్కెట్ ఎక్స్పర్ట్స్ దృవీకరించారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయి 5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 4జీ ఓఎల్ టీఈ డ్యూయల్ సిమ్, 2/3జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 215 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. జియో మార్కెట్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) ఏప్రిల్-2021 లెక్కల ప్రకారం.. మే 2021 నాటికి జియో యూజర్లు 431,23 మిలియన్ల యూజర్లతో ప్రథమస్థానంలో ఉంది. ఆ తరువాతి స్థానాల్లో 189.49 మిలియన్లతో ఎయిర్ టెల్ , 119.63 మిలియన్లతో వొడాఫోన్ - ఐడియా, 16.44 మిలియన్ యూజర్లతో తరువాత స్థానాల్లో ఉన్నాయి. అయితే టెలికాం రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న జియో యూజర్లను పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. దీంతో రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ గూగుల్‌తో కలిసి ఈ జియోఫోన్ నెక్ట్స్ ను మార్కెట్ లో విడుదల చేయనుంది. -
జియో ఫోన్ల డెలివరీ అప్పటి నుంచే...
రిలయన్స్ జియో ఫోన్ ఆలస్యమయ్యే వార్త నిజమయ్యేటట్టే కనిపిస్తోంది. ఆగస్టు 24 ప్రారంభమైన ఈ ఫోన్ బుకింగ్స్‌కు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఫోన్ల డెలివరీ మరికొంతకాలం పాటు పట్టవచ్చని రిపోర్టులు వెలువడుతున్నాయి.. ఆగస్టు 24వ తేదీని ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో బుకింగ్స్‌కు వచ్చిన ఈ ఫోన్‌కు అరవై లక్షలకు పైగా ప్రీబుకింగ్స్ వచ్చాయని తెలిసింది. ప్రీబుకింగ్స్ మరింత వెల్లువెత్తుతుండటంతో, ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోలేక కంపెనీ వాటిని నిలిపివేసింది కూడా. కేవలం వినియోగదారుల ఆసక్తిని మాత్రమే ప్రస్తుతం నమోదుచేసుకుంటుంది. ఈ అనూహ్య స్పందనతో జియోఫోన్ డెలివరీని నవరాత్రి పండుగ నుంచి ప్రారంభమవుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కస్టమర్లకే ఈ డెలివరీ తేదీలు సెప్టెంబర్ 25గా కంపెనీ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ తొలి వారంలో ఈ ఫోన్ల డెలివరీ ఉండాలి. కానీ ఈ ఫోన్లు తమ స్టోర్లలోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు చెందిన ఓ రిటైలర్లే చెప్పారు. సెప్టెంబర్ 24 తేదీల్లో స్టోర్లలోకి ఈ ఫోన్లు వస్తాయంటూ రిలయన్స్ డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్ ప్రతినిధులు తెలిపారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్‌లో ఈ ఫోన్‌ను అందించనున్నారు. నగరాల్లో అందుబాటు కూడా భిన్నమైన తేదీల్లో రానున్నాయి. ఆఫ్‌లైన్, ఆన్లైన్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను జియో చేపట్టింది. తొలుత రూ.500 కట్టి జియోఫోన్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. కానీ బుకింగ్స్ వెల్లువ విపరీతంగా కొనసాగుతుండటంతో, రెండు రోజుల్లోనే వీటిని నిలిపివేసింది. త్వరలోనే మళ్లీ ప్రీ-బుకింగ్స్‌ను చేపడతామని జియో చెప్పింది. -
షాకింగ్: జియో ఫోన్ బుకింగ్స్ క్లోజ్
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఫోన్‌కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. ఆగస్టు 24వ తేదీ ఆన్లైన్లో బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే వెబ్సైట్ క్రాష్ అయ్యేంత అనూహ్య స్పందన వెల్లువెత్తింది. ఒక్కరోజులోనే ఈ ఫోన్ 30 లక్షల మార్కును క్రాస్ చేసింది కూడా. అయితే ప్రస్తుతం జియో ఫోన్ బుకింగ్స్‌ను ఆ కంపెనీ నిలిపివేసినట్టు తెలిసింది. జియో సైట్లో ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నామని జియో ఫోన్ కావాలనుకునే వారు కేవలం ఇప్పుడు తమ ఆసక్తిని మాత్రమే రిజిస్ట్రర్ చేసుకోడంటూ రిలయన్స్ పేర్కొంది. ప్రీ-బుకింగ్స్‌ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామో తర్వాత తెలుపుతామంటూ జియో సైట్లో తెలిపింది. తాత్కాలికంగా అయితే బుకింగ్ ఆప్షన్‌ను తొలగిస్తున్నట్టు పేర్కొంది. '' థాంక్యూ ఇండియా! లక్షల మంది జియో ఫోన్‌ను బుక్ చేసుకున్నారు'' అని జియో.కామ్ హోమ్ పేజీలో కంపెనీ బ్యానర్‌గా ఈ విషయాన్ని తెలిపింది. జియో అకస్మాత్తుగా ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను నిలిపివేయడంతో, తర్వాత బుక్ చేసుకోవచ్చని భావించిన ప్రజలు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. జియో 4G ఫీచర్ ఫోన్ బుకింగ్స్ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రారంభమై, 26వ తేదీ ఉదయం వరకు కొనసాగాయి. అంటే 36 గంటలు మాత్రమే ఈ బుకింగ్స్‌కు అనుమతి ఇచ్చింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్పటికే కోటి ఫోన్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. జియో ఫోన్‌ను ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి సెప్టెంబర్‌లో అందిస్తారు. అయితే సెప్టెంబర్‌లో ఏ తేదీని ఫోన్ల డెలివరీ ఉంటుంది, ఏ స్టోర్‌లో ఈ ఫోన్‌ను కలెక్ట్ చేసుకోవచ్చో తెలుపుతూ కంపెనీ మెసేజ్ పంపనుంది.