బీహార్ సీఎంగా జితన్ రామ్
గవర్నర్‌కు మద్దతుదారుల జాబితా సమర్పణ
వెల్లడించిన నితీశ్‌కుమార్
న్యూఢిల్లీ: బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా దళిత నేత జితన్ రామ్ మంజి బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చింది. అరుుతే సీఎం ఎంపిక బాధ్యతను నితీశ్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆయన జితన్‌ను ఎంపిక చేశారు. గవర్నర్ డి.వై.పాటిల్‌ను కలిసి జితన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చె ప్పినట్టు నితీశ్ సోమవారం తెలిపారు. 117మంది జేడీయూ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఓ సీపీఐ సభ్యుడితో కలిపి 120 మంది మద్దతుతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేసినట్లు తెలిపారు. జితన్ నాయకత్వాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యూదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బాశిస్తా నారాయణ్ సింగ్‌లు ఆమోదించినట్లు చెప్పారు. ఆయనకు విశేషానుభవం ఉందని, పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు.
రాజీనామా ఉపసంహరణకు నితీశ్ ససేమిరా: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ నితీశ్ గత శనివారం సీఎం పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. అరుుతే పదవిలో కొనసాగాల్సిందిగా పార్టీ నాయకత్వం ఆయనపై ఒత్తిడి తెచ్చింది. ఆదివారం జేడీయూఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు నితీశ్ సీఎంగా కొనసాగాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం చేసిన ప్రయత్నాలు సోమవారం సైతం ఫలించలేదు. రాజీనామా వెనక్కి తీసుకునేందుకు నితీశ్ అంగీకరించలేదు. సోమవారం నాటి జేడీయూఎల్పీ కీలక భేటీకి ముందు శరద్ మాట్లాడుతూ నితీశ్ రాజీనామాకు సంబంధించి అదే తుది నిర్ణయమని, కొత్త నేత ఎన్నిక జరుగుతుందని చెప్పారు. సమావేశానంతరం పార్టీని ముందుకు నడిపించే పనిని నితీశ్ కొనసాగిస్తారని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఆయన సంధానకర్తగా వ్యవహరిస్తారని నారాయణ్ సింగ్ చెప్పారు. కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను నితీశ్‌కే అప్పగించామన్నారు. కాగా ఇది తన సిద్ధాంతాలకు సంబంధించిన విషయం, చేయూల్సిన సరైన పనిగా తాను భావించినట్టు నితీశ్ చెప్పారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మద్దతును గెలుచుకుంటే తిరిగి బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమన్నారు. శరద్ యూదవ్తో పాటు ప్రధాన కార్యదర్శి కె.సి.త్యాగి పాల్గొన్న శాసనసభాపక్ష సమావేశం..
నితీశ్ నేతృత్వంలోనే పార్టీ 2015 ఎన్నికలకు వెళుతుందంటూ తీర్మానాన్ని ఆమోదించింది. నితీశ్‌కు 68 ఏళ్ల జితన్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడనే పేరుంది. జెహానాబాద్ జిల్లాలోని మఖ్దుమ్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గయ(ఎస్సీ) నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. జేడీయూలో చేరకముందు కాంగ్రెస్, ఆర్జేడీ ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు. 1980 మొదలు మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యూరు. ఇలావుండగా నితీశ్ రాజీనామా వ్యవహారాన్ని బీజేపీ, ఎల్జేపీలు డ్రామాగా అభివర్ణించారుు. బీహార్‌లో జేడీయూ సర్కారుకు మద్దతును కొనసాగించాలా వద్దా అన్న నిర్ణయాన్ని హైకమాండ్‌కు కట్టబెడుతూ రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో మొత్తం 239 సీట్లకుగాను జేడీయూకు 117 మంది , బీజేపీకి 90 మంది, ఆర్జేడీకి 21 మంది, కాంగ్రెస్‌కు నలుగురు ఎమ్మెల్యులున్నారు. ఇతరులు మరో ఏడుగురున్నారు. బీహార్‌లో జేడీయూ ప్రభుత్వం కొనసాగాలంటే కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి.