బీహార్ సీఎంగా జితన్ రామ్ | jitan-ram-as-new -chief-minister-of-bihar | Sakshi
Sakshi News home page

Published Tue, May 20 2014 6:34 AM | Last Updated on Thu, Mar 21 2024 6:37 PM

బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా దళిత నేత జితన్ రామ్ మంజి బాధ్యతలు స్వీకరించేందుకు రంగం సిద్ధమైంది. నితీశ్ కుమార్ ప్రభుత్వంలో జితన్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ మంత్రిగా వ్యవహరించారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ రాజీనామా చేయడం, రాజీనామా ఉపసంహరణకు ఆయన ససేమిరా అనడంతో జేడీయూ కొత్త సీఎంను ప్రకటించాల్సి వచ్చింది. అరుుతే సీఎం ఎంపిక బాధ్యతను నితీశ్‌కే వదిలిపెట్టింది. దీంతో ఆయన జితన్‌ను ఎంపిక చేశారు. గవర్నర్ డి.వై.పాటిల్‌ను కలిసి జితన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చె ప్పినట్టు నితీశ్ సోమవారం తెలిపారు. 117మంది జేడీయూ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు, ఓ సీపీఐ సభ్యుడితో కలిపి 120 మంది మద్దతుతో కూడిన జాబితాను గవర్నర్‌కు అందజేసినట్లు తెలిపారు. జితన్ నాయకత్వాన్ని జేడీయూ జాతీయ అధ్యక్షుడు శరద్‌యూదవ్, రాష్ట్ర అధ్యక్షుడు బాశిస్తా నారాయణ్ సింగ్‌లు ఆమోదించినట్లు చెప్పారు. ఆయనకు విశేషానుభవం ఉందని, పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement