Job union leaders
-
అది నేనే.. ఇదీ నేనే
యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాంకేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం. ఇది ఉద్యోగులకు నష్టదాయకం. ఉద్యోగుల సంపదంతా ప్రభుత్వానికి పుణ్యానికి ఇవ్వడమే. ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పెన్షన్ అందించాలి. ప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. – ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘంముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి ఉద్యోగుల మేలు కోసం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను తెస్తే ఆయన గగ్గోలు పెట్టారు. దీనివల్ల ఉద్యోగుల ప్రయోజనాలు దెబ్బతింటాయని గుండెలు బాదుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వం తరహాలోనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)ను తెస్తే బాబు కిమ్మనడం లేదు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇద్దరు మంత్రులు ఉన్నా తనపై ఉన్న కేసులకు భయపడి యూపీఎస్‌ను వ్యతి రేకించే సాహసం చంద్రబాబు చేయడం లేదు. దీంతో ఆయన వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉద్యోగులను నిలువెల్లా మోసం చేయడమే బాబు ఉద్దేశమని నిప్పులు చెరుగుతున్నారు.సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల పింఛన్ విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం మెరుగైన పింఛన్ వచ్చేలా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) తెస్తే చంద్రబాబు వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు. జీపీఎస్ విధానంతో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతోపాటు కూటమి నేతలు ప్రచారం చేశారని ఉద్యోగుల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ సంయక్తంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను వ్యతిరేకించిన చంద్రబాబు తాను భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పేరుతో జీపీఎస్ తరహాలోనే తెచ్చినా నోరుమెదపకపోవడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది ఆయన రెండు కళ్ల సిద్ధాంతానికి అద్దం పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ తరహాలోనే యూపీఎస్‌ను తెచ్చినా.. దాదాపు జీపీఎస్ తరహాలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ను తెచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. అయినప్పటికీ కేంద్ర మంత్రిమండలిలో ఇద్దరు టీడీపీ సభ్యులు ఉన్నా చంద్రబాబు వ్యతిరేకించకపోవడంపై మండిపడుతున్నారు. ఇది చంద్రబాబు, కూటమి నేతలు సీపీఎస్ ఉద్యోగులను మోసం చేయడమేనని సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన యూపీఎస్ వల్ల కూడా అంతే నష్టం జరుగుతున్నా నోరు విప్పకపోవడం ఏంటని నిలదీస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులను దగా చేయడమే ఆయన ఉద్దేశమని దుయ్యబడుతున్నారు. బయటపడ్డ చంద్రబాబు మోసపూరిత నైజం.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్, జీపీఎస్ విధానాన్ని సమీక్షించకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు జూలై 12న జీపీఎస్ అమలుకు ఆర్థిక శాఖ ద్వారా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయించారని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు మెరుగైన విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించలేదని ధ్వజమెత్తుతున్నారు. జీపీఎస్ అమలు కోసం గెజిట్ విడుదల చేయించడంతోనే చంద్రబాబు మోసపూరిత నైజం బయటపడిందని నిప్పులు చెరుగుతున్నారు. గెజిట్ విడుదల విషయం మీడియాలో రావడంతో ‘చంద్రబాబు ఆగ్రహం’ అంటూ ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయని, గెజిట్ అమలు నిలిపేయాలని ఆదేశించారంటూ కూడా కథనాలు అచ్చేశాయని గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు గెజిట్ నిలుపుదల ఉత్తర్వులే జారీ కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాబు ఆగ్రహమనేది ఉత్తి మాటేననేది.. గెజిట్ నిలుపుదల చేయకపోవడంతోనే అర్థమైందని మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు, కూటమి నేతలు వ్యతిరేకించకపోవడంతో ఆ నేతల అసలు స్వరూపం బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుకు గెజిట్ జారీ చేయించడంతో పాటు ఇప్పుడు కేంద్రం తెచ్చిన యూపీఎస్‌ను చంద్రబాబు వ్యతిరేకించలేదంటే సీపీఎస్ ఉద్యోగులను నిలువునా మోసం చేయడమేనని నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ముందో మాట.. ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడంలో చంద్రబాబు నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తుతున్నారు. కేంద్రం యూపీఎస్ తెస్తే కనీసం మాట్లాడకపోవడం కూటమి నేతల ద్వంద్వ వైఖరికి అర్థం పడుతోందని సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. పెన్షన్ భిక్ష కాదు.. ప్రాథమిక హక్కు..తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్.. ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీమ్. చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్ పథకాన్ని అందించాలి. పెన్షన్ భిక్ష కాదు.. ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు. ఇది ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగుల ఆకాంక్షలకు సోమనాథన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడున్న ఎన్పీఎస్ పథకంలో రిటైరయ్యాక వచ్చే 60 శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కంటే 5 రెట్లు ఎక్కువ వస్తుంది. ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. 35, 40 ఏళ్ల పాటు ఉద్యోగి సర్వీసులో బేసిక్ పే, డీఏలో పది శాతం నొక్కేసి.. మ్యాచింగ్ గ్రాంట్ అంటూ దానికి కొంత పోగేసి, చివర్లో రిటైరయ్యాక మొత్తం కార్పస్ ఫండ్‌ను మింగేసే కుట్రే యూపీఎస్. ఉద్యోగుల పెన్షన్ సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం?. – సీఎ దాస్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుయూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాంప్రభుత్వం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలి. తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్‌లో ప్రాన్ ఎమౌంట్ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకుని 50 శాతం పింఛన్‌ను డీఆర్తో కలిపి ఇస్తారా? లేక ప్రస్తుత పింఛన్ పథకంలో ఉన్నట్లు 60 శాతం ప్రాన్ అమౌంట్ ఇస్తారా? అనేది తేల్చాలి. అలాగే యూపీఎస్ పెన్షన్‌ను ఏ విధంగా, ఎవరి ద్వారా చెల్లిస్తారనేదానిపైనా స్పష్టత ఇవ్వాలి. సర్వీసులో ఉండి మరణించిన ఉద్యోగికి కుటుంబ పింఛన్ 60 శాతం చెల్లిస్తారా? స్వచ్ఛంద పదవీ విరమణ విషయంలో కనీస సర్వీస్ ఎంతగా నిర్ణయిస్తారు? రిటైర్ అయ్యాక అప్పటివరకు ఉద్యోగి చెల్లించిన మొత్తం తిరిగి ఉద్యోగికి చెల్లిస్తారా? లేకపోతే యూపీఎస్, లంప్సమ్ ఎమౌంట్తో సరిపెడతారా? వీటన్నింటిపైనా స్పష్టత ఇవ్వాలి. – కె.సతీష్, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకుడు -
నా మాటలను వక్రీకరించారు
శ్రీకాకుళం అర్బన్: రాజకీయ స్వలాభం కోసం తన మాటలను కొన్ని పత్రికలు, మీడియా వక్రీకరించి కథనాలు ఇచ్చాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన 71 సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సఖ్యత చెడగొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరించాయని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకీ తొత్తులు కాదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కష్టమొస్తే ప్రభుత్వంపైనే అలుగుతామని, సమస్యలు పరిష్కరిస్తే అదే ప్రభుత్వానికి, సీఎంకు పాలాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. పీఆర్సీ నిరసనల్లో పాల్గొనం ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం సాక్షి, అమరావతి: పీఆర్సీ ప్రకటించాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీలు మంగళవారం నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ తెలిపింది. ఈ మేరకు ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి.రమణారెడ్డి, గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరమ్ అధ్యక్షుడు ఏవీ పటేల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీని పది రోజుల్లో ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలియజేసినందున.. మంగళవారం నుంచి జేఏసీలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల, అధికారుల సంక్షేమం విషయంలో సీఎం జగన్‌పై తమకు విశ్వాసం ఉందన్నారు. -
ఎవరా ఐఏఎస్?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మందుల కొనుగోళ్లల్లో రోజుకో అక్రమం వెలుగుచూస్తోంది. ఈ వ్యవహారంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి హస్తం ఉందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విజిలెన్స్ విచారణకు ముందు సనత్‌నగర్‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ కార్యాలయంలోని రికార్డు రూముల్లో లెక్కలు తారుమారు చేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని సీసీటీవీ ఫుటే జీని పరిశీలిస్తే మరిన్ని విష యాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. బోరబండ, పటాన్చెరు, చర్లపల్లి డిస్పెన్సరీల్లోనే రూ.100 కోట్లకుపైగా అవినీతి జరిగిందని సమాచారం. నాలుగేళ్లలో రూ.700 కోట్ల మందుల కొనుగోళ్లలో దాదాపు రూ.200 కోట్లకుపైగా మింగేశారని ఆరోపిస్తున్నారు. ఎలా నడిపారంటే? 2015 నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంలో డైరెక్టర్ దేవికారాణిది కీలక పాత్ర. ఈమె నేతృత్వంలో జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కూరపాటి వసంత ఇందిరా, ఫార్మాసిస్ట్ రాధిక, సీనియర్ అసిస్టెంట్ ఒగ్గు హర్షవర్ధన్, ఆమ్ని ఫార్మాకు చెందిన చెరుకూరి నాగరాజు, కంచర్ల హరిబాబు అలియాస్ బాబ్జీలతో కథ నడిపారు. వాస్తవానికి మందుల కొనుగోళ్లలో నియమ నిబంధనలు, మార్గదర్శకాలకు సంబంధించి జీవో నంబర్ 51ను ప్రభుత్వం 2012లోనే విడుదల చేసింది. దాని ప్రకారం.. రిజిస్టర్డ్ కంపెనీల నుంచే కొనుగోళ్లు చేయాలి. రిజిస్టర్ కంపెనీలు అందుబాటులో లేని అత్యవసర సమయాల్లో మాత్రమే గుర్తింపులేని ప్రైవేటు కంపెనీల నుంచి కొనుక్కోవచ్చన్న వెసులుబాటు ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని జాయింట్ డైరెక్టర్ పద్మతో కలసి దేవికారాణి కథ మొత్తం నడిపింది. నలభైకి పైగా నకిలీ కంపెనీలు దేవికా రాణికి చెందినవేనని సిబ్బంది ఆరోపిస్తున్నారు. మొత్తం 140 కంపెనీలను అప్పటికప్పుడు సృష్టించి నకిలీ బిల్లులు పెట్టి కోట్లు డ్రా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని, ముందే ఖాళీ బిల్లులపై, ఇండెట్లపై ముందుగానే సంతకాలు చేసి ఉంచేవారు. దేవికారాణి ఎంత చెబితే అంత వేసి డబ్బు డ్రా చేసుకునేవారు. దీంతో ఈ ముఠాలోని సభ్యులంతా హైదరాబాద్ శివార్లలో భారీగా భూములు, అపార్ట్మెంట్లు, నగలు, బంగారం బిస్కెట్లు కొన్నారని సమాచారం. సీఎం నాకు బంధువు.. జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ అక్రమాలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని బెదిరిస్తూ ఉండేదనిసిబ్బంది చెబుతున్నారు. ‘నా ఇంటి పేరు తెలుసా? సీఎం కేసీఆర్‌ది నాదీ ఒకే ఇంటిపేరు. ఆయన నాకు బంధువు’ అంటూ నేమ్ ప్లేట్ చూపించి బెదిరించేదని వాపోతున్నారు. ఈ కుంభకోణంలో డైరెక్టర్ నుంచి మెడికల్ రిప్రంజెంటేటివ్ వరకు అంతా పాత్రధారులే కావడంతో కథ సాంతం సాఫీగా సాగేది. ఎక్కడైనా కొత్త సిబ్బంది వస్తే.. వారిని ప్రలోభ పెట్టడం, లేకపోతే బెదిరించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఐఎంఎస్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ ఓ డాక్టర్‌ను ఖాళీ బిల్లులపై సంతకాలు చేయాల్సిందిగా ప్రలోభపెట్టిన ఆడియో టేపులు లీకవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో దేవికారాణి ముఠా ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను తమతో కలుపుకొన్నారని ఉద్యో గ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనకు భారీగా లంచం ముట్టజెప్పడంతో ఆడిట్ రికార్డులను చెరిపేందుకు వచ్చాడని ఆరోపిస్తున్నారు. కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో బ్యాంకు మేనేజర్లతో పెద్ద మొత్తంలో కమీషన్ మాట్లాడుకుని కొత్త నోట్లు మార్చుకున్నారని సమాచారం. దారి మళ్లించి దండుకున్నారు! మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులతో మందుల కొనుగోళ్లు బీమా వైద్య సేవల సంచాలక (డీఐఎంఎస్) విభాగంలో ఉన్నతాధికారుల అక్రమాలు క్రమంగా బయటపడుతున్నాయి. ఈఎస్ఐ నిబంధనలకు తూట్లు పొడిచి భారీగా నిధులను స్వాహా చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. కేంద్ర ప్రభుత్వం డీఐఎంఎస్‌కు విడు దల చేసిన నిధులను నిర్దేశిత కార్యక్రమాల కోసం కాకుండా అక్రమాలకు వినియోగించిన తీరు బహిర్గతమైంది. రాష్ట్రంలో ఈఎస్ఐ ఖాతాదారులు 18.5 లక్షల మంది ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 58 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సేవల లభ్యత కష్టమైనప్పుడు ఈఎస్ఐసీ గుర్తింపు పొందిన ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో లబ్ధిదారులు చికిత్స పొందొచ్చు. వీరికి నిబంధనల ప్రకారం ఈఎస్ఐసీ వైద్య ఖర్చును రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా డీఐఎంఎస్‌లకు విడుదల చేస్తుంది. అక్కడ వైద్య బిల్లులను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత చెల్లింపులను ఖరారు చేసి లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తుంది. ఇలా మెడికల్ రీయింబర్స్మెంట్ నిధులను క్రమం తప్పకుండా ఈఎస్ఐసీ విడుదల చేస్తుండగా... డీఐఎంఎస్ మాత్రం వీటిని దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడింది. ఐదేళ్లలో రూ.110 కోట్ల మళ్లింపు ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన ఈఎస్ఐ ఖాతాదారులు రీయింబర్స్మెంట్ కోసం డీఐఎంఎస్‌కు పెట్టుకున్న అర్జీల పరిశీలన, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు ఐదేళ్లుగా వీటి చెల్లింపుల ప్రక్రియ గాడి తప్పింది. అత్యవసర కార్యక్రమం కింద మందుల కొనుగోలుకు మళ్లించారు. గత ఐదేళ్లలో దాదాపు 110 కోట్లను ఇలా మందులు కొనుగోలు చేయడం గమనార్హం. డీఐఎంఎస్‌లో మెడికల్ రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పెరుకుపోయాయి. దాదాపు లక్ష బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులను పూర్తిస్థాయిలోచెల్లించాలంటే రూ.178 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బదిలీల.. లాబీయింగ్!
► ఎంపీడీఓల స్థానచలనానికి రంగం సిద్ధం ► కీలక స్థానాల కోసం ‘భారీ’ పైరవీలు ► సొంత మండలంపై కొందరి ఆసక్తి ► చక్రం తిప్పుతున్న ఓ యూనియన్ నేత సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు ఏటా జరుగుతున్నా ఈసారి మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. పలువురు రాజకీయ నేతల ముద్ర ప్రత్యక్షంగా కనపించే అవకాశం ఉంటుందని, అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు తమ మాట వినని వారిని సాగనంపి, సన్నిహితులకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బదిలీలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నవారు ప్రాతిపదిక ఏమిటో తెలియజేయాలని, ఒకటి లేదా రెండు ఆప్షన్లు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కొందరు ఎంపీడీఓలు తమ రాజకీయ పలుకుబడితో కీలకస్థానాలను పొందాలని ప్రయత్నిస్తుండడం సహచర అధికారుల్లో ఆవేదన రగిలిస్తోంది. అలాగే తమకు సన్నిహితంగా ఉండే వారికి కీలకపోస్టింగ్‌లు ఇప్పించేందుకు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో బదిలీల పర్వం పూర్తికానుందన్న ప్రచారం నేపథ్యంలో పలువురు అధికారులు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు, ఇతర ముఖ్యనేతలను కలిసి మంచి పోస్టింగ్ ఇప్పించాలని ప్రాధేయపడుతున్నట్లు తెలుస్తోంది. సొంత మండలంపై కొందరి గురి! సాధారణంగా ఎంపీడీఓల బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా సడలింపు ఇవ్వాల్సి ఉంది. అయితే పరిపాలన అవసరాల రీత్యా బదిలీలను జిల్లాస్థాయి అధికారులు చేసి ప్రభుత్వాని కి నోటిఫికేషన్‌ను పంపించే సౌలభ్యం ఉండడంతో బదిలీల పర్వాన్ని వేగవంతం చేశారు. ఏ ప్రాతిపదికన.. ఏ ఎంపీడీఓను ఎక్కడికి బ దిలీ చేస్తున్నారన్న అంశం మాత్రం ఇప్పటికీ చిదంబర రహస్యంగానే ఉంది. గెజిటెడ్‌స్థాయి అధికారులు తమ సొంత మండలాల్లో పనిచేయడానికి అవకాశం లేదని నిబంధనలు ఉన్నా కొందరు ఎంపీడీఓలు మాత్రం తమ సొంత మండలంలోనే పోస్టింగ్ పొం దేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలి సింది. ఉద్యోగ సంఘాల నాయకులుగా చె లామణి అవుతున్న ఓ ఇద్దరు అధికారులు ప్ర స్తుతం ఉన్న డిప్యూటేషన్ పోస్టులో కాకుండా మహబూబ్‌నగర్ ఎంపీడీఓగా, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న మండలానికి ఎంపీడీఓగా వెళ్లేందుకు భారీ పైరవీలే చేస్తున్నారని ఉద్యోగవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అంతా గోప్యంగానే..! జిల్లాలో 64 మండలాలకు అనేక మండలాల్లో ఇన్‌చార్జ్‌లే ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. కేవలం 41మంది మాత్రమే రెగ్యులర్ పోస్టింగ్‌లో ఉన్నారు. అయితే వీరిలో 25నుంచి 28 మంది ఎంపీడీఓలకు బదిలీ తప్పేలాలేదు. అధికారపార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమకు కావాల్సిన అధికారుల జాబితాను జిల్లా అధికారులకు, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు అందజేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఐదేళ్లుగా ఎంపీడీఓల బదిలీలు జరగలేదని ఉన్నతాధికారులు చెబుతుండగా 2014 సాధారణ ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు జిల్లాకు చెందిన అనేక మంది ఎంపీడీఓలు ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లారని, అవి సర్వీస్ రిజిస్టర్లో నమోదుకాలేదని పేర్కొంటున్నారు. సాంకేతికంగా జిల్లాలో రెండేళ్లకు పై బడిన అధికారులకు మాత్రమే బ దిలీ ఉంటుందని పలువురు అధికారులు విశ్లేస్తున్నారు. బదిలీల వి షయమై తమకు సూత్రప్రాయంగానైనా జిల్లా అధికారులు సమాచారం ఇస్తారని, కానీ అత్యంత రహస్యంగాా ప్రక్రియ జరుగుతుండడంతో పోస్టింగ్ ఎవరికి ఎక్కడ వస్తుందోనని ఎంపీడీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈనెల 13వ తేదీలోగా ఎంపీడీఓల బదిలీలను పూర్తిచేసి ప్రభుత్వాన్ని పంపించాలని జిల్లా అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం.