Jodhpur girl
-
బ్లూహె(వే)ల్: మరోసారి అఘాయిత్యం
జోధ్‌పూర్: ‘బ్లూవేల్’ భూతం సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ప్రమాదకర బ్లూవేల్ ఇంటర్నేట్ గేమ్ యువత ప్రాణాలతో చెలగాటమాడుతోంది. దీని సవాల్‌కు స్పందించి ఇప్పటికే పలువురు చిన్న పిల్లలు, యువత ప్రాణాలు కోల్పోగా, ఎంతోమంది మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 17 ఏళ్ల అమ్మాయి రెండోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోబోయింది. సకాలంలో గుర్తించి ఆస్పత్రికి తరలించడంతో గండం గడిచింది. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ జవాను కూతురైన ఈ అమ్మాయి ‘బ్లూవేల్’ టాస్క్ పూర్తి చేసేందుకు సోమవారం అర్ధరాత్రి ఆమె చెరువులోకి దూకేసింది. స్థానికులు గమనించి ఆమెను కాపాడటంతో ఆపద తప్పింది. ఎందుకు దూకావని ప్రశ్నిస్తే బిత్తరపోయే సమాధానమిచ్చింది. చేతిపై పొడుచుకున్న బ్లూవేల్ బొమ్మను చూపిస్తూ.. ‘నేను ఈ చివరి టాస్క్ పూర్తి చేయకపోతే మా అమ్మ చచ్చిపోతుంది’ అని ఏడుస్తూ చెప్పింది. ఈ ఉదంతం తర్వాత కూడా ‘బ్లూవేల్’ నుంచి ఆమె పూర్తిగా బయట పడకపోవడంతో తాజాగా మరోసారి ఆత్మహత్యకు యత్నించింది. -
బాలిక ఆత్మహత్య; బయటపడ్డ నిజం
జోధ్‌పూర్: స్వాతంత్య్రదినోత్సవం రోజున రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఏడేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాజాగా ఆమె గురించి భయంకర నిజం తెలిసింది. ఆత్మహత్యకు ముందు బాలిక అత్యాచారానికి గురైందని తేలింది. బాలిక ఇంట్లోనే నివసించే మైనర్ బాలుడు ఈ నెల 12-15 మధ్య పలుమార్లు ఈ ఆకృత్యానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాప మూడో తరగతి చదువుతోంది. బిహార్‌కు చెందిన వీరి కుటుంబాలు జోధ్‌పూర్‌లోని బాస్‌ని ప్రాంతంలో ఒకే ఇంట్లో నివసిస్తున్నాయి. ఆగస్టు 15న స్కూలు నుంచి తిరిగొచ్చాక బాలిక ఉరివేసుకుంది. స్కూల్లో తిట్టినందుకు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని మొదట భావించారు. అయితే పోస్టుమార్టమ్ నివేదికలో అసలు విషయం తెలిసింది. 'పోస్టుమార్టం నివేదిక అందింది. బాలిక అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి షాక్ గురయ్యామ'ని దర్యాప్తు అధికారి రాజేశ్ యాదవ్ అన్నారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. -
జోధ్‌పూర్‌లో విద్యార్థినిపై యాసిడ్ దాడి
జైపూర్: జోధ్‌పూర్‌లో విద్యార్థిపై యాసిడ్ దాడిని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన వసుంధర రాజె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మాట్లాడుతూ... రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిందని గెహ్లట్ ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఆమెకు వైద్య సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జోధ్‌పూర్‌లోని మౌలానా ఆజాద్ టీచర్స్ ట్రైనింగ్ కళాశాల నుంచి వస్తున్న విద్యార్థినిపై బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడి చేసి అక్కడ నుంచి పరారైయ్యారు. యాసిడ్ దాడిలో సదరు విద్యార్థి మెడతో పాటు ఆమె శరీర వెనక భాగం తీవ్రంగా కాలిపోయింది. దీంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.