Jodie Foster
-
'మహిళా దర్శకులు రావడం అవసరం'
లాస్ ఏంజిల్స్:మరింత మంది మహిళా దర్శకులు రావడం అవసరం అంటోంది నటి, దర్శకురాలు జోదీ ఫోస్టర్. హాలీవుడ్ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలంటే మహిళలు కెమెరా వెనుక ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తాజాగా స్పష్టం చేసింది. మూడు సంవత్సరాల వయసులో యాక్టింగ్ కెరీర్ ను ఆరంభించిన ఈ అమ్మడు.. చాలా మార్పులు చూసిందంట. అయితే ఇంకా చాలా మారాలని.. అందుకోసం మహిళలే స్వయంగా మెగా ఫోన్ చేత పట్టాలని సూచించింది. తాను ఫిల్మ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాక మహిళా దర్శకులు తన కంట పటలేదని తెలిపింది. -
గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన నటి!
ఇది నిజంగా షాకింగ్ న్యూసే! పురుషుల్ని పురుషులు, స్త్రీలను స్త్రీలు పెళ్లాడటం ప్రస్తుత సమాజంలో ఓ ఫ్యాషన్ అయిపోయినట్లుంది. కలికాలం పిదప బుద్ధులు అని కలవరపడటం తప్ప ఇంకేం చేయలేం. విషయం ఏంటంటే... హాలీవుడ్ నటి జోడీ ఫాస్టర్, తన గాళ్‌ఫ్రెండ్ అలెగ్జాండ్రా హెడిసన్‌ని పెళ్లాడేశారు. వృత్తి రీత్యా అలెగ్జాండ్రా ఫొటోగ్రాఫర్. మొదట్లో తను తీసే ఛాయా చిత్రాలను ఇష్టపడిన జోడీ, ఆ తర్వాత అలెగ్జాండ్రా మీదే మనసు పారేసుకున్నారు. అలెగ్జాండ్రా పరిస్థితి కూడా అంతే. గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ ఇక విడివిడిగా బతకలేం అనుకుని పెళ్లి చేసేసుకున్నారు. ‘ది సెలైన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’, ‘పానిక్ రూమ్’ తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించి, మన్ననలు అందుకున్నారు జోడీ ఫాస్టర్. అయితే, తాజా చర్యతో విమర్శల పాలయ్యారు. -
స్నేహితురాలిని పెళ్లాడిన హాలీవుడ్ నటి!
లాస్ ఎంజెలెస్: హాలీవుడ్ నటి జోడీ ఫాస్ట్రర్ తన స్నేహితురాలు అలెగ్జాండ్రా హెడిసన్ ను పెళ్లాడారు. అమెరికాలోని ఓ టాక్ షో హోస్ట్ ఎలెన్ డీజెనెరెస్ మాజీ ప్రియురాలు అలెగ్జాండ్రా హెడిసన్ గత కొద్దికాలంగా జోడి ఫాస్టర్ కు ఫోటోగ్రాఫర్ గా సేవలందిస్తున్నారు. బుధవారం అత్యంత నిరాడంబరంగా సాగిన ఓ వేడుకలో ఫాస్టర్, హెడిసన్ పెళ్లి తంతు ముగిసిందని స్థానిక పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది. గత సంవత్సర కాలంగా ఫాస్టర్, హెడిసన్ లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. నటుడు సిడ్నీ బెర్నార్డ్ తో సుదీర్ఘంగా రిలేషన్ కొనసాగించారు. బెర్నార్డ్, ఫాస్టర్ లిద్దరూ 2008లో విడిపోయారు. టాక్సీ డ్రైవర్, సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్, ది అక్యూజ్ డ్' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.