'మహిళా దర్శకులు రావడం అవసరం'
లాస్ ఏంజిల్స్:మరింత మంది మహిళా దర్శకులు రావడం అవసరం అంటోంది నటి, దర్శకురాలు జోదీ ఫోస్టర్. హాలీవుడ్ పరిస్థితుల్లో మార్పులు తీసుకురావాలంటే మహిళలు కెమెరా వెనుక ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తాజాగా స్పష్టం చేసింది. మూడు సంవత్సరాల వయసులో యాక్టింగ్ కెరీర్ ను ఆరంభించిన ఈ అమ్మడు.. చాలా మార్పులు చూసిందంట.
అయితే ఇంకా చాలా మారాలని.. అందుకోసం మహిళలే స్వయంగా మెగా ఫోన్ చేత పట్టాలని సూచించింది. తాను ఫిల్మ్ బిజినెస్ లోకి అడుగుపెట్టాక మహిళా దర్శకులు తన కంట పటలేదని తెలిపింది.