స్నేహితురాలిని పెళ్లాడిన హాలీవుడ్ నటి!
స్నేహితురాలిని పెళ్లాడిన హాలీవుడ్ నటి!
Published Thu, Apr 24 2014 11:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
లాస్ ఎంజెలెస్: హాలీవుడ్ నటి జోడీ ఫాస్ట్రర్ తన స్నేహితురాలు అలెగ్జాండ్రా హెడిసన్ ను పెళ్లాడారు. అమెరికాలోని ఓ టాక్ షో హోస్ట్ ఎలెన్ డీజెనెరెస్ మాజీ ప్రియురాలు అలెగ్జాండ్రా హెడిసన్ గత కొద్దికాలంగా జోడి ఫాస్టర్ కు ఫోటోగ్రాఫర్ గా సేవలందిస్తున్నారు.
బుధవారం అత్యంత నిరాడంబరంగా సాగిన ఓ వేడుకలో ఫాస్టర్, హెడిసన్ పెళ్లి తంతు ముగిసిందని స్థానిక పీపుల్స్ మ్యాగజైన్ వెల్లడించింది. గత సంవత్సర కాలంగా ఫాస్టర్, హెడిసన్ లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. నటుడు సిడ్నీ బెర్నార్డ్ తో సుదీర్ఘంగా రిలేషన్ కొనసాగించారు.
బెర్నార్డ్, ఫాస్టర్ లిద్దరూ 2008లో విడిపోయారు. టాక్సీ డ్రైవర్, సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్, ది అక్యూజ్ డ్' చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Advertisement
Advertisement