గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన నటి! | Jodie Foster marries girlfriend Alexandra Hedison in Los Angeles ceremony | Sakshi
Sakshi News home page

గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన నటి!

Published Thu, Apr 24 2014 11:17 PM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM

గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన నటి!

గాళ్‌ఫ్రెండ్‌ని పెళ్లాడిన నటి!

ఇది నిజంగా షాకింగ్ న్యూసే! పురుషుల్ని పురుషులు, స్త్రీలను స్త్రీలు పెళ్లాడటం ప్రస్తుత సమాజంలో ఓ ఫ్యాషన్ అయిపోయినట్లుంది. కలికాలం పిదప బుద్ధులు అని కలవరపడటం తప్ప ఇంకేం చేయలేం. విషయం ఏంటంటే... హాలీవుడ్ నటి జోడీ ఫాస్టర్, తన గాళ్‌ఫ్రెండ్ అలెగ్జాండ్రా హెడిసన్‌ని పెళ్లాడేశారు. వృత్తి రీత్యా అలెగ్జాండ్రా ఫొటోగ్రాఫర్. మొదట్లో తను తీసే ఛాయా చిత్రాలను ఇష్టపడిన జోడీ, ఆ తర్వాత అలెగ్జాండ్రా మీదే మనసు పారేసుకున్నారు. అలెగ్జాండ్రా పరిస్థితి కూడా అంతే. గత ఏడాది కాలంగా డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరూ ఇక విడివిడిగా బతకలేం అనుకుని పెళ్లి చేసేసుకున్నారు. ‘ది సెలైన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’, ‘పానిక్ రూమ్’ తదితర చిత్రాల్లో అద్భుతంగా నటించి, మన్ననలు అందుకున్నారు జోడీ ఫాస్టర్. అయితే, తాజా చర్యతో విమర్శల పాలయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement