Journey Ensuring
-
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో భరోసా
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ :ప్రయాణంపై పూర్తి భరోసా కల్పించేలా ఆర్టీసీ పనిచేస్తోందని, ఈ సంస్థ కనుక లేకపోతే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో శనివారం నిర్వహించిన 25వ భద్రత వారోత్సవాల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే మన ఆర్టీసీ ఎంతో చక్కగా పనిచేస్తోందన్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని కొత్త రూట్లలో బస్సులు తిప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు బాగున్నా, కాంప్లెక్సుల్లోని క్యాంటిన్లలో ఆహార పదార్థాలు నాశిరకంగా ఉంటున్నాయని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రతి రోజూ 22 వేలకు పైగా బస్సులతో 45 వేల మంది డ్రైవర్లు కోటీ 80 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారని చెప్పారు. సురక్షిత డ్రైవింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఏటా కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 84 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం 21 నుంచి 29 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా డ్రైవింగ్ చేసిన 31 మందిని సన్మానించారు. సన్మాన గ్రహీతలు వీరే.. జోనల్ స్థాయిలో 29 ఏళ్ల 10 నెలల 9 రోజులుగా ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేసిన శ్రీకాకుళం రెండో డిపోకు చెందిన టి.రాజారావును ఘనంగా సన్మానించారు. రీజినల్ స్థాయిలో కె.జి.మూర్తి, జె.ఎస్.టి.ఎస్.రావు, కె.ఎస్.రావులను, డిపో స్థాయిలో వి.ఎస్.నారాయణ, ఎన్.రమణ, ఎస్.ఎస్.రావు(పార్వతీపురం), జి.జి.రావు, కె.రాము, ఎస్.కె.రావు(సాలూరు) ఎ.ఎస్.నారాయణ, జి.ఎం.ఎస్.రావు, కె.కొండ (ఎస్.కోట) జి.బి.రావు, కె.ఎస్.రావు, బి.ప్రకాశం (విజయనగరం), ఆర్.చంద్రరావు, బి.ఎస్.రావు, వై.ఎల్.రావు (పాలకొండ), కె.జె.ఆర్.ఆచారి, జి.సన్యాసి, టి.బి.రావు (పలాస), వి.ఎం.రావు, కె.ఆర్.రావు, కె.వి.రావు (శ్రీకాకుళం ఒకటో డిపో), బి.వి.ఎస్.నారాయణ, డి.నీలం, పి.సీతారాం (శ్రీకాకుళం రెండో డిపో), ఎం.ఎన్.బి.రావు, జె.ఎస్.నారాయణ, వై.బి.రావు (టెక్కలి)లను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీ బి.డి.వి.సాగర్, విజయనగరం డీసీటీఎం శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఒకటి, రెండు, పలాస, టెక్కలి, ఎస్.కోట డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, రమేష్, నంబాళ్ళ అరుణకుమారి, శ్రీనివాసరావు, ఈయూ నాయకులు పి.భానుమూర్తి, బొత్స గౌరు, బి.కృష్ణమూర్తి, కొర్లాం గణేశ్వరరావు, కె.సుమన్, ఎస్.వి.రమణ, పి.రమేష్, ఎన్ఎంయూ నాయకులు పి.వి.వి.మోహన్, ఎం.ఎ.రాజు, బీఎల్పీ రావు, శాంతరాజు, ఆర్.వెంకట్రావు, సీఆర్సీ ఎ.ఆర్.మూర్తి, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంతో భరోసా
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్ :ప్రయాణంపై పూర్తి భరోసా కల్పించేలా ఆర్టీసీ పనిచేస్తోందని, ఈ సంస్థ కనుక లేకపోతే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పవని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శ్రీకాకుళం ఒకటవ డిపో గ్యారేజీ ఆవరణలో శనివారం నిర్వహించిన 25వ భద్రత వారోత్సవాల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే మన ఆర్టీసీ ఎంతో చక్కగా పనిచేస్తోందన్నారు. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఆర్టీసీ బస్సులు తిరగక ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. జిల్లాలోని కొత్త రూట్లలో బస్సులు తిప్పాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. బీఆర్‌ఏయూ వీసీ లజపతిరాయ్ మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు బాగున్నా, కాంప్లెక్సుల్లోని క్యాంటిన్లలో ఆహార పదార్ధాలు నాశిరకంగా ఉంటున్నాయని చెప్పారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రతి రోజూ 22 వేల పైచిలుకు బస్సులతో 45 వేల మంది డ్రైవర్లు కోటీ 80 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారని చెప్పారు. సురక్షిత డ్రైవింగ్‌పై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఏటా కచ్చితంగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 84 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయన్నారు. డిప్యూటీ ఛీఫ్ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యనారాయణ, డీటీసీ ఎస్.వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. అనంతరం 21 నుంచి 29 ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా డ్రైవింగ్ చేసిన 31 మందిని సన్మానించారు. సన్మాన గ్రహీతలు వీరే.. జోనల్ స్థాయిలో 29 ఏళ్ల 10 నెలల 9 రోజులుగా ప్రమాదరహితంగా డ్రైవింగ్ చేసిన శ్రీకాకుళం రెండవ డిపోకు చెందిన టి.రాజారావును ఘనంగా సన్మానించారు. రీజినల్ స్థాయిలో కె.జి.మూర్తి, జె.ఎస్.టి.ఎస్.రావు, కె.ఎస్.రావులను, డిపో స్థాయిలో వి.ఎస్.నారాయణ, ఎన్.రమణ, ఎస్.ఎస్.రావు(పార్వతీపురం), జి.జి.రావు, కె.రాము, ఎస్.కె.రావు(సాలూరు) ఎ.ఎస్.నారాయణ, జి.ఎం.ఎస్.రావు, కె.కొండ (ఎస్.కోట) జి.బి.రావు, కె.ఎస్.రావు, బి.ప్రకాశం (విజయనగరం), ఆర్.చంద్రరావు, బి.ఎస్.రావు, వై.ఎల్.రావు (పాలకొండ), కె.జె.ఆర్.ఆచారి, జి.సన్యాసి, టి.బి.రావు (పలాస), వి.ఎం.రావు, కె.ఆర్.రావు, కె.వి.రావు (శ్రీకాకుళం ఒకటవ డిపో), బి.వి.ఎస్.నారాయణ, డి.నీలం, పి.సీతారాం (శ్రీకాకుళం రెండవ డిపో), ఎం.ఎన్.బి.రావు, జె.ఎస్.నారాయణ, వై.బి.రావు (టెక్కలి)లను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఎస్పీ బి.డి.వి.సాగర్, విజయనగరం డీసీటీఎం శ్రీనివాసరావు, శ్రీకాకుళం ఒకటి, రెండు, పలాస, టెక్కలి, ఎస్.కోట డిపోల మేనేజర్లు ఎం.సన్యాసిరావు, ఎం.ముకుందరావు, రమేష్, నంబాళ్ళ అరుణకుమారి, శ్రీనివాసరావు, ఈయూ నాయకులు పి.భానుమూర్తి, బొత్స గౌరు, బి.కృష్ణమూర్తి, కొర్లాం గణేశ్వరరావు, కె.సుమన్, ఎస్.వి.రమణ, పి.రమేష్, ఎన్ఎంయూ నాయకులు పి.వి.వి.మోహన్, ఎం.ఎ.రాజు, బీఎల్పీ రావు, శాంతరాజు, ఆర్.వెంకట్రావు, సీఆర్సీ ఎ.ఆర్.మూర్తి, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.