జాయ్ జెమీమా కేసు: ‘ హర్షకుమార్కు ఎందుకంత ఇంట్రెస్టో అర్థం కావడం లేదు’
విశాఖ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన జాయ్ జెమీమా హనీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి. ఈ మేరకు మంగళవారం హనీ ట్రాప్ కేసుకు సంబంధించి కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు సీపీ. ‘జాయ్ జెమీమా గ్యాంగ్ చాలామంది జీవితాలతో ఆడుకుంది. మోసాలతో పాటు హత్యాయత్నాలు కూడా చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ వేణురెడ్డి రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జాయ్ జెమీమా పెళ్లి జరిగినట్లు ఒప్పుకున్నారు. 10 మందిని జాయ్ జెమీమా మోసం చేసినట్లు గుర్తించాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం. ఈ కేసులో ఆయనకు ఎందకతం ఇంట్రెస్టో అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులతో సంబంధాలపై విచారణ చేస్తున్నాం. జాయ్ జెమీమాతో ఎంపీ హర్షకుమార్ కుమారుడు పరిచయాలపై విచారణ జరుగుతోంది.మాజీ ఎంపి హర్ష కుమార్ కుమారునికి జాయ్ జమీమాకు పరిచయాలు పై విచారణ జరుగుతోంది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ముఠాలో ప్రధాన నిందితులు జాయ్ జెమిమాతో పాటు వేణు రెడ్డి, కిషోర్లను అరెస్ట్ చేశాం. ఈ ముఠాకు సంబంధించిన మరో ముగ్గురిని గుర్తించాం త్వరలో అరెస్టు చేస్తాం’ అని సీపీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెళ్లైన వారే కిలాడీ లేడీ టార్గెట్..!విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత