breaking news
Juan Martin del Potro
-
యూఎస్ ఓపెన్: ఫెడరర్ ఓటమి..
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ లో సంచలనం నమోదు అయింది. ఐదు సార్లు చాంపియన్ అయిన రోజర్ ఫెడరర్‌ను అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్ పొట్రో యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌లో కంగు తినిపించాడు. 2009 యూఎస్ ఫైనల్లో షాకిచ్చి టైటిల్ ఎగురేసుకుపోయిన ఈ అర్జెంటీనియన్ మరోసారి టైటిల్ రేసులో నిలిచాడు. 2009 ఫైనల్లో ఓడించిన పొట్రోను ఓడించి కసితీర్చుకోవాలనుకున్న ఫెడరర్ ఆశలు గల్లంతయ్యాయి. పురుషుల సింగిల్స్ లో భాగంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన హోరాహోరీ పోరులో పోట్రో 7-5, 3-6, 7-6(10/8), 6-4తో ఫెడరర్‌పై విజయం సాధించారు. తొలి సెట్ ను కోల్పోయి వెనుకబడిన ఫెడరర్.. రెండో సెట్ లో సునాయాసంగా విజయం సాధించాడు. కాగా, మూడో సెట్ లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగింది. అయితే టై బ్రేక్ దారి తీసిన మూడో సెట్ లో చివరకు పెట్రో రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. ఆపై అదే ఊపును కొనసాగించిన పెట్రో నాల్గో సెట్ ను సాధించి సెమీస్ కు అర్హత సాధించాడు. తద్వారా ఆరోసారి యూఎస్ ఓపెన్ గెలవాలనుకున్న ఫెడరర్ క్వార్టర్స్ నుంచి భారంగా నిష్ర్కమించాల్సి వచ్చింది. ఇక ఈ తాజా విజయంతో పొట్రో శుక్రవారం జరిగే సెమీస్‌లో వరల్డ్ నెంబర్1 నాదల్‌తో తలపడనున్నాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు డెల్‌పొట్రో దూరం
టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అర్జెంటీనా స్టార్ యువాన్ మార్టిన్ డెల్‌పొట్రో దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని గత నెలలో అర్జెంటీనాకు తొలిసారి డేవిస్‌కప్ టైటిల్‌ను అందించిన డెల్‌పొట్రో అన్నాడు. గాయాల నుంచి కోలుకొని ఈ ఏడాదిని 1,042వ ర్యాంక్‌తో ప్రారంభించిన ఈ యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ సీజన్‌ను 38వ ర్యాంక్‌తో ముగించడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 16 నుంచి 29 వరకు మెల్బోర్న్లో జరుగుతుంది. -
డెల్‌పోట్రో సంచలనం
వింబుల్డన్ ప్రిక్వార్టర్స్ నాలుగోసీడ్ వావ్రింకాపై గెలుపు వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లో వీనస్, నవారో రెండోరౌండ్లో పేస్, బోపన్న జోడీలు లండన్: మూడుసార్లు మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నా తన రాకెట్లో పవర్ తగ్గలేదని అర్జెంటీనా స్టార్ ఆటగాడు యువాన్ మార్టిన్ డెల్‌పోట్రో నిరూపించాడు. గత రెండేళ్లుగా ఆటకు దూరంగా ఉన్నా... వింబుల్డన్‌లో అంచనాలకు మించి రాణించాడు. భారీ సర్వీస్‌లతో పాటు కోర్టులో చురుకుగా కదులుతూ నాలుగు సెట్ల పోరాటంలో నాలుగోసీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్)కు షాకిచ్చాడు. దీంతో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లో ప్రపంచ 165వ ర్యాంకర్ డెల్‌పోట్రో 3-6, 6-3, 7-6 (7/2), 6-3తో వావ్రింకాను ఓడించి మూడోరౌండ్లోకి అడుగుపెట్టాడు. ఐదో రోజు వర్షం వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. వావ్రింకాతో రెండు గంటలా 44 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... డెల్‌పోట్రో పాయింట్ల కోసం తీవ్రంగా పోరాడాడు. వావ్రింకా 15 ఏస్‌లు, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయగా, డెల్‌పోట్రో 9 ఏస్‌లు 4 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. అయితే 47 విన్నర్లు సంధించిన స్విస్ ప్లేయర్ 48 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఐదు బ్రేక్ పాయింట్లలో మూడిం టిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. కానీ డెల్‌పోట్రో తన సర్వీస్‌లో అత్యధిక పాయింట్లు నెగ్గడంతో పాటు కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో 10వ సీడ్ బెర్డిచ్ (చెక్) 6-4, 6-1, 6-2తో బెకర్ (జర్మనీ)పై; 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 6-4, 6-3తో యువాన్ మొనాకో (అర్జెంటీనా)పై; 32వ సీడ్ పౌలీ (ఫ్రాన్స్) 6-4, 6-3, 6-3తో యంగ్ (అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో వీనస్: మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా), సూరెజ్ నవారో (స్పెయిన్) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మూడోరౌండ్లో వీనస్ 7-5, 4-6, 10-8తో కస్తాకినా (రష్యా)పై; నవారో 6-2, 6-2తో ఎరకోవిచ్ (న్యూజిలాండ్)పై గెలిచారు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల్లో పావులెంచెకోవా (రష్యా) 7-5, 6-1తో పుటినెత్సోవా (కజకిస్తాన్)పై; 24వ సీడ్ స్ట్రయికోవా (చెక్) 6-4, 6-0తో రొడినా (అమెరికా)పై; బీక్ (జర్మనీ) 6-2, 6-1తో సన్స్నోవిచ్ (బెలారస్)పై నెగ్గి మూడోరౌండ్లోకి అడుగుపెట్టారు. మూడో రౌండ్లో సెరెనా: మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో టాప్‌సీడ్ సెరెనా (అమెరికా) 6-7 (7/9), 6-2, 6-4తో మెక్‌హాలే (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గి మూడోరౌండ్లోకి ప్రవేశించింది. బోపన్న, పేస్ జోడీల శుభారంభం భారత డబుల్స్ ప్లేయర్లు రోహన్ బోపన్న, లియాండర్ పేస్లు తమ భాగస్వాములతో కలిసి వింబుల్డన్‌లో శుభారంభం చేశారు. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో ఆరోసీడ్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జి (రొమేనియా) 7-5, 7-6 (8-6)తో అన్‌సీడెడ్ మారిన్ డ్రాంగ్జా- నికోలా మెక్టిక్ (క్రొయేషియా)పై; పేస్-మత్కోవాస్కీ (పోలాండ్) 6-1, 6-3తో హు లూ (తైపీ)-టిప్సరెవిచ్ (సెర్బియా)పై నెగ్గి రెండోరౌండ్లోకి ప్రవేశించారు. డ్రాంగ్జా-మెక్టిక్‌తో జరిగిన 80 నిమిషాల పోరులో బోపన్న ద్వయం స్థాయికి తగిన ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలిసెట్లో 11వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన బోపన్న ద్వయం తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకుని సెట్‌ను చేజిక్కించుకుంది. రెండోసెట్లో రెండు జోడీలు సర్వీస్‌లు నిలబెట్టుకోవడంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో బోపన్న-మెర్జి వరుసగా రెండు గేమ్‌లు గెలిచి సెట్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు.