ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు డెల్‌పొట్రో దూరం | Juan Martin del Potro confirms he will miss 2017 Australian Open | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు డెల్‌పొట్రో దూరం

Published Sun, Dec 25 2016 1:07 AM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు డెల్‌పొట్రో దూరం

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు డెల్‌పొట్రో దూరం

టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు అర్జెంటీనా స్టార్‌ యువాన్‌ మార్టిన్‌ డెల్‌పొట్రో దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగానే తానీ నిర్ణయం తీసుకున్నానని గత నెలలో అర్జెంటీనాకు తొలిసారి డేవిస్‌కప్‌ టైటిల్‌ను అందించిన డెల్‌పొట్రో అన్నాడు. గాయాల నుంచి కోలుకొని ఈ ఏడాదిని 1,042వ ర్యాంక్‌తో ప్రారంభించిన ఈ యూఎస్‌ ఓపెన్‌ మాజీ చాంపియన్‌ సీజన్‌ను 38వ ర్యాంక్‌తో ముగించడం విశేషం. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జనవరి 16 నుంచి 29 వరకు మెల్‌బోర్న్‌లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement