Jubilee Hills apollo hospital
-
ఎనిమిదేళ్లనాటి ఘటన.. అపోలో వైద్య బృందానికి భారీ జరిమానా
సాక్షి, హైదరాబాద్: వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అపోలో ఆసుపత్రి వైద్యుల బృందానికి భారీ జరిమానా విధించింది రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. బాధిత కుటుంబానికి రూ.15 లక్షల పరిహారం చెల్లించాలని తెలిపింది. ఈ ఘటన ఎనిమిదేళ్ల కిందటి నాటిది కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ హుడా కాలనీలో నివసించే ఎం.ఆర్.ఈశ్వరన్(53) తీవ్ర కడుపునొప్పితో 2012 సెప్టెంబర్ 18న జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే డయాబెటిక్ పేషెంట్‌గా ఎనిమిదేళ్లు ఆయన వైద్య సహాయం పొందుతున్నాడు. ఈశ్వరన్‌ను పరీక్షించిన వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకొని కొలొనోస్కోపీ టెస్ట్ చేయించాలని సూచించారు. అదే నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ‘కొలొనోస్కోపీ’పరీక్ష కోసం వైద్యులు అపాయింట్మెంట్ ఇవ్వగా, 3 గంటలు ఆలస్యంగా పరీక్షకు తీసుకెళ్లారు. అయితే ఈశ్వరన్ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లాడు. 116 రోజులు వెంటిలేటర్‌పై ఉండి 2013 జనవరి 14న చనిపోయాడు. ఆసుపత్రి వైద్యులు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ఈశ్వరన్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్ర వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంతో.. తాజాగా పరిహారం తీర్పు వెల్లడించింది ఫోరం. ఇదీ చదవండి: డబ్బుకోసం చూస్తే.. సుతారీ మేస్త్రీకి గుండె ఆగినంత పనైంది -
దగ్గుబాటికి గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళ వారం గుండెపోటుకు గురయ్యారు. హుటా హుటిన ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి 2 స్టెంట్లు వేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. -
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు
-
సోగసు చూడతరమా.. !
జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో శనివారం అమ్ముకుట్టీలు సందడి చేశారు. కేరళ ఫెస్టివల్ ఓనం పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కేరళకు చెందిన నర్సులు. సంప్రదాయ పాటలతో, ఉయ్యాలాటలతో నగరానికి మలయాళమారుతం తీసుకొచ్చారు. దీపం చుట్టూ నాట్యం చేస్తూ లయబద్ధంగా సాగిన ‘తిరువదిర’ ఘట్టం అందర్నీ ఆకట్టుకుంది. అందమైన రంగవల్లులతో పండుగను కలర్ఫుల్గా చేసుకున్నారు. కేరళియన్ ఫుడ్‌తో ఓనం ఫెస్టివల్‌ను టేస్ట్‌ఫుల్‌గా చేసుకున్నారు. కేర్‌లో క్వీన్ బంజారాహిల్స్‌లోని కేర్ ఓపీ సెంటర్లో జాతీయ పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు శనివారం జోష్‌ఫుల్‌గా సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ న్యూట్రిషనిస్ట్ పోటీలు అందర్నీ అలరించాయి. న్యూట్రిషన్ కళాశాలల విద్యార్థులు 15 మంది ఈ పోటీలకు హాజరై అదరగొట్టారు. హిమాయత్‌నగర్ మదీన డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో ఎమ్మెస్సీ విద్యార్థిని మార్యా రుబీనా మిస్ న్యూట్రిషనిస్టుగా ఎంపికైంది. మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ విజేత రుచికశర్మ రుబీనాకు కిరీటం తొడిగారు. - బంజారాహిల్స్