సోగసు చూడతరమా.. ! | Kerala girls wearing sarees to celebrate Onam festival | Sakshi
Sakshi News home page

సోగసు చూడతరమా.. !

Sep 7 2014 3:49 AM | Updated on Sep 2 2017 12:58 PM

సోగసు చూడతరమా.. !

సోగసు చూడతరమా.. !

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో శనివారం అమ్ముకుట్టీలు సందడి చేశారు. కేరళ ఫెస్టివల్ ఓనం పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కేరళకు చెందిన నర్సులు.

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్‌లో శనివారం అమ్ముకుట్టీలు సందడి చేశారు. కేరళ ఫెస్టివల్ ఓనం పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు కేరళకు చెందిన నర్సులు. సంప్రదాయ పాటలతో, ఉయ్యాలాటలతో నగరానికి మలయాళమారుతం తీసుకొచ్చారు. దీపం చుట్టూ నాట్యం చేస్తూ లయబద్ధంగా సాగిన ‘తిరువదిర’ ఘట్టం అందర్నీ ఆకట్టుకుంది. అందమైన రంగవల్లులతో పండుగను కలర్‌ఫుల్‌గా చేసుకున్నారు. కేరళియన్ ఫుడ్‌తో ఓనం ఫెస్టివల్‌ను టేస్ట్‌ఫుల్‌గా చేసుకున్నారు.
 
 కేర్‌లో క్వీన్
బంజారాహిల్స్‌లోని కేర్ ఓపీ సెంటర్లో జాతీయ పౌష్టికాహార వారోత్సవ కార్యక్రమాలు శనివారం జోష్‌ఫుల్‌గా సాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్ న్యూట్రిషనిస్ట్ పోటీలు అందర్నీ అలరించాయి. న్యూట్రిషన్ కళాశాలల విద్యార్థులు 15 మంది  ఈ పోటీలకు హాజరై అదరగొట్టారు. హిమాయత్‌నగర్ మదీన డిగ్రీ అండ్ పీజీ కాలేజ్‌లో ఎమ్మెస్సీ విద్యార్థిని మార్యా రుబీనా మిస్ న్యూట్రిషనిస్టుగా ఎంపికైంది. మిసెస్ సౌత్ ఏషియా ఇంటర్నేషనల్ విజేత రుచికశర్మ రుబీనాకు కిరీటం తొడిగారు.
 -  బంజారాహిల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement