లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసుల పరిష్కారం
లీగల్ (కడప అర్బన్):
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని,ఈ కార్యక్రమం ద్వారానే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే విధంగా చూస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో 2015 నుంచి 2016 వరకు 800కు పైగా లోక్ అదాలత్ కార్యక్రమాలను నిర్వహించి కోట్ల రూపాయల్లో నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు. ఈ కార్యక్రమంలో నాల్గవ అదనపు జిల్లా జడ్జి అన్వర్‌బాషా, ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాసమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ యూయూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
1598 కేసులకు పరిష్కారం
ఈ లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో ఎంతోకాలంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 1998 కేసులకుగాను 1598 కేసులకు పరిష్కారం లభించింది. వీటి ద్వారా కక్షిదారులకు రూ. 5,45,81,581 ఇప్పించారు.