june 16th
-
16 నుంచి బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ఈనెల 16న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సచివాలయ కార్యదర్శి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. అందుకే అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులు బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు శాసనసభలోనే సమావేశమవడం రివాజు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు సభల సభ్యులు ఒకే ప్రాంగణంలో సమావేశమైతే భౌతిక దూరం పాటించడం వీలు కాదు. అందువల్ల కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీలు మండలిలోనూ, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ సమావేశమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. -
16న రాయదుర్గంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ
రాయదుర్గం అర్బన్ : అవినీతిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానానికి చేర్చిన తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాయదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండల కన్వీనర్లు, నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాపు మాట్లాడారు. ఈ నెల 16న రాయదుర్గంలో వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణ సమీపంలోని మద్దానేశ్వరస్వామి ఆలయంలో ఆ రోజు ఉదయం 9.30 గంటలకు జరిగే ప్లీనరీకి నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఇసుక దందాలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రూ.కోట్లు గడిస్తున్నారన్నారు. ‘నీరు - చెట్టు’ పనుల్లో 50 శాతం మేర నిధులు అధికార పార్టీ నాయకుల జేబుల్లోకే వెళ్లాయని చెప్పారు. ఈ పనులపై విజిలెన్స్ అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహిస్తే వాస్తవాలు వెల్లడవుతాయన్నారు. మూడేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతికి లైసెన్స్ ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మల్లికార్జున, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎన్టీ సిద్దప్ప, ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజనాయక్, పట్టణ కన్వీనర్ నబీష్, డీ.హిరేహాళ్ కన్వీనర్ వన్నూరుస్వామి, కణేకల్లు కన్వీనర్ ఆలూరి చిక్కన్న, గుమ్మఘట్ట కన్వీనర్ కాంతారెడ్డి, బొమ్మనహాళ్ కన్వీనర్ ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఓటమిపై 16న సమీక్ష
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడానికి గల కారణాలపై ఈ నెల 16న సమీక్షించనున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణమే తమ అజెండా అని ఆ పార్టీకి చెందిన ఎంఎల్సీ రుద్రరాజు పద్మరాజు చెప్పారు. వచ్చే నెల 13, 14న విజయవాడలో కాంగ్రెస్ పార్టీ సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన సాధారణ, స్థానిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఘోరపరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేపోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ చిత్తుగా ఓడిపోయింది.