'టెంపర్' చూపించిన అభిమానులు
తిరుపతి : జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 'టెంపర్' చూపించారు. తిరుపతిలోని జయశ్యాం థియేటర్‌పై గురువారం ఉదయం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దాడి చేశారు. టెంపర్ సినిమా ఆలస్యంగా ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. టెంపర్ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేసినా థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కాగా యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన 'టెంపర్' శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు. జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ నటించింది.