Jurassic world 2
-
అంతకు మించి..!
ఇలా కూడా సినిమాలు తీయొచ్చా? యానిమేషన్లో ఇంతటి పెద్ద జంతువులను క్రియేట్ చేయొచ్చా? అని ‘జురాసిక్ పార్క్’ చూసినవాళ్లు అనుకోకుండా ఉండలేకపోయారు. 1993లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మూడు భాగాలకూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు ఐదో భాగం నిర్మాణంలో ఉంది. నాలుగో భాగం ‘జురాసిక్ వరల్డ్’కి దర్శకత్వం వహించిన కాలిన్ ట్రెవెరోనే ఐదో భాగమైన ‘జురాసిక్ వరల్డ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. 2018 జూన్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఏదో డైనోసార్ రావడం, ఛేజ్ చేయడం.. ఈ సినిమా అలా ఉండదు. స్టోరీ లైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ముందు వచ్చిన నాలుగు భాగాలకన్నా ఇంకా భయంగా, ఉత్కంఠగా ఉంటుంది. టెక్నికల్‌గా కూడా ఆ చిత్రాలకు మించి ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. -
జురాసిక్ వరల్డ్-2 దర్శకుడు ఇతనే!
‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్‌గా దాదాపు 14 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. ‘జురాసిక్ వరల్డ్’ దర్శకుడు కొలిన్ ట్రవెర్రో ఈ సీక్వెల్‌నూ తెరకెక్కిస్తారన్న వార్తలొచ్చాయి. అయితే ఆయనకు మరో హిట్ సిరీస్ ‘స్టార్ వార్స్’ సీక్వెల్‌కు డెరైక్షన్ ఛాన్స్ రావడంతో చిత్రబృందం మరో దర్శకుడి కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. చివరికి ఈ అవకాశం ‘ద ఇంపాజిబుల్’, ‘ద ఆర్ఫనేజ్’ చిత్రాలను తెరకెక్కించిన జేఎ ఆంటోనియో బయోనను వరించింది. 2018 జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.