అంతకు మించి..! | Colin Trevorrow On How Jurassic World 2 Justifies Its Existence | Sakshi
Sakshi News home page

అంతకు మించి..!

Published Mon, Oct 3 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

అంతకు మించి..!

అంతకు మించి..!

ఇలా కూడా సినిమాలు తీయొచ్చా? యానిమేషన్‌లో ఇంతటి పెద్ద జంతువులను క్రియేట్ చేయొచ్చా? అని ‘జురాసిక్ పార్క్’ చూసినవాళ్లు అనుకోకుండా ఉండలేకపోయారు. 1993లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన మూడు భాగాలకూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే లభించింది. ఇప్పుడు ఐదో భాగం నిర్మాణంలో ఉంది. నాలుగో భాగం ‘జురాసిక్ వరల్డ్’కి దర్శకత్వం వహించిన కాలిన్ ట్రెవెరోనే ఐదో భాగమైన ‘జురాసిక్ వరల్డ్ 2’ని తెరకెక్కిస్తున్నారు. 2018 జూన్ 22న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఏదో డైనోసార్ రావడం, ఛేజ్ చేయడం.. ఈ సినిమా అలా ఉండదు. స్టోరీ లైన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ముందు వచ్చిన నాలుగు భాగాలకన్నా ఇంకా భయంగా, ఉత్కంఠగా ఉంటుంది. టెక్నికల్‌గా కూడా ఆ చిత్రాలకు మించి ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement