ముషారఫ్‌పై మాత్రమే ‘రాజద్రోహం’ విచారణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో 2007లో అధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషారఫ్ మాత్రమే రాజ్యాంగాన్ని కూలదోయాలనుకున్నాడని, రాజద్రోహం కేసులో ఆయనపై మాత్రమే విచారణ జరుగుతుందని పాక్ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ అబ్దుల్ హమీద్ దోగర్, మరో ఇరువురిని విచారణ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.