Justice Jasti Chalameswar
-
డబ్బు, వారసత్వం శాసిస్తున్నాయి
రాజకీయాలపై జస్టిస్ చలమేశ్వర్ అహ్మదాబాద్: ధన బలం, వారసత్వ రాజకీయాలు.. రాజకీయ న్యాయాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో డబ్బు, రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తూ రాజ్యాంగ నిర్మాతలు నిర్దేశించిన రాజకీయ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అహ్మదాబాద్లో జస్టిస్ పీడీ దేశాయ్ స్మారక ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్టసభలో సభ్యుడయ్యే అర్హతను చివరకు ధనబలం నిర్ణయిస్తుందని, ఒకరు చట్ట సభలో సభ్యుడైతే.. అతని భార్య, పిల్లలు, మిగతా కుటుంబసభ్యులు ఆ స్థానం కోసం వరుసలో ఉంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ తప్పుపట్టారు. ‘రాజకీయ క్షేత్రంలో సమానత్వం, న్యాయం విషయానికొస్తే.. మనమింకా ప్రాథమిక దశలోనే ఉన్నాం. రాజ్యాల్ని, జ్యేష్ట పుత్రుడికి వారసత్వ హక్కు నిబంధనను రద్దు చేశాం. అయితే ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించే విషయంలో ఎంతవరకూ రాజకీయ న్యాయం సాధించాం?’ అని జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు. -
మహానందిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కర్నూలు జిల్లాలోని మహానందిలో కొలువైన కామేశ్వరిదేవీ సమేత మహానందీశ్వరుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనతో పాటు వచ్చిన న్యాయమూర్తుల బృందానికి ఆలయ ఏఈవో మధు, వేద పండితులు స్వాగతం పలికారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెంట నంద్యాల జడ్జి యూ రామ్మోహన్, కర్నూలు ఎక్సైజ్ మేజిస్ట్రేట్ రాజు, నాంపల్లి అదనపు జిల్లా న్యాయమూర్తి ప్రవీణ, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి శంకర్ తదితరులు ఉన్నారు. స్వామి దర్శనం అనంతరం వారు అహోబిలం వెళ్లారు. -
'భారతీయుల్లో ప్రతిభాపాటవాలు మెండు'
హైదరాబాద్: భారతీయులకు అన్నింట్లోనూ ప్రతిభాపాటవాలు మెండుగానే ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తెలిపారు. సోమవారం వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెజీషియన్స్ సొసైటీ అమెరికా వారిచే మెర్లిన్ అవార్డును స్వీకరించబోతున్న సందర్భంగా ప్రముఖ అంతర్జాతీయ ఇంద్రజాలికులు సామల వేణుకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందులోనైనా గొప్పవాళ్లు ఉంటే వారిని వారు గొప్ప వాళ్లని ఒప్పుకొవటానికి సంకోచం మనకు సంకోచమన్నారు. అదే పరాయి వాళ్లల్లో ఉంటే గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. సామల వేణుకు మెర్లిన్ అవార్డు రావటం అందరికి గర్వకారణమన్నారు. కళలు రకరకాలు ఉంటాయని గుర్తు చేశారు. పిల్లలు ఆనందించే విద్య ఇంద్రజాలం అని తెలిపారు. కళాకారులను గౌరవించుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ జ్యోతిష్యం- ఇంద్రజాలం విభన్నమైనవి అయినా అవి రెండు విద్యలేనని చెప్పారు. భారతీయ కళా నైపుణ్యానికి నిదర్శనం ఇంద్రజాలం అని తెలిపారు. జస్టిస్ చలమేశ్వర్ చేతుల మీదుగా సామల వేణును ఘనంగా సత్కరించారు.