సమాజంలో మార్పుతోనే మహిళా సాధికారిత
హైదరాబాద్:మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతూ ముందంజలో ఉన్నా వారి పట్ల వివక్ష కొనసాగుతోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన మహిళా దినోత్సవ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దైవజ్ఞశర్మ మాట్లాడుతూ సమస్త చరాచర సృష్టికి మూలం స్త్రీయేనని అలాంటి మహిళల్ని గౌరవించటం మన సంప్రదాయమన్నారు.
ఈ సందర్భంగా కూచిపూడి నర్తకి డాక్టర్ పి.రమాదేవి, ఆచార్య డాక్టర్ శరత్ జ్యోత్స్నారాణి, గాయని లావణ్య లత, విద్యావేత్త సి.అరుణ, చెస్ క్రీడాకారిణి హుస్నా సమీరలను పురస్కారాలతో సత్కరించారు. సభకు సాధన నరసింహాచార్య అధ్యక్షత వహించారు.