justin theroux
-
కుర్రాడు కావాలి!
జెన్నిఫర్ ఆనిస్టన్ ఈ మధ్యే భర్త జస్టిన్ థెరోకు విడాకులు ఇచ్చి ఫ్రీ బర్డ్ అయింది. అంతకుముందు బ్రాడ్పిట్తోనూ ఆమె పెళ్లి నిలవలేదు. ఇప్పుడు రెండో పెళ్లీ బ్రేక్ చేసి, ఫ్రీ బర్డ్ అయ్యాక ఆమె ఒక వింత కోరిక బయటపెట్టింది. అదేమిటంటే.. కుర్రాడితో ప్రేమలో పడాలని. తన వయసున్న వారితో ప్రేమ, పెళ్లి బోర్ కొట్టిందట జెన్నిఫర్‌కు. ఇప్పుడిప్పుడే ముప్పైల్లోకి అడుగుపెడుతున్న, పాతికేళ్లు దాటిన కుర్రాళ్లైతే పూర్తిగా డిపెండ్ అవ్వరనీ, వారితో సరదాగా ప్రేమలో పడి లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నట్లు జెన్నిఫర్ చెప్పింది. ఈ వయసు కుర్రాళ్లతో అయితే పూర్తిగా కమిట్ అవ్వాల్సిన అవసరం లేదని, వాళ్లైతే కొత్తగా ఆలోచిస్తారని, నాన్సెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందని జెన్నిఫర్ ఆలోచన. జెన్నిఫర్ వయసు ఇప్పుడు 49 ఏళ్లు. మరి ఆమె కోరిక ఎలా నెరవేరుతుందో చూడాలి!! -
అవును.. మేం విడిపోయాం!
హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ అనిస్టన్ 49వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఆమె ఫ్రెండ్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకుంటున్నారు. కానీ ఆ వేడుకలో ఆమె భర్త జస్టిన్ థెరో మాత్రం కనిపించలేదు. ఎందుకు కనిపించలేదంటే.. అక్కడున్న ఆమె ఫ్రెండ్స్‌కి తెలుసు. కానీ అక్కడున్న అందరికీ అయితే తెలీదు. తెలీదు కాబట్టి వాళ్లంతా పుకార్లు పుట్టిస్తారు. జస్టిన్ ఎందుకు లేడనే పుకార్లు. అంత దూరం ఎందుకు పోవడం అనుకుంది జెన్నిఫర్. జస్టిన్‌తో కలిసి ఒక కంబైన్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.. ‘అవును.. మేమిద్దరం విడిపోయాం!’ అని. 2015లో పెళ్లి చేసుకున్న జస్టిన్, జెన్నిఫర్‌ల బంధం మూడేళ్లు కాకముందే విడాకుల వరకు వెళ్లింది. నిజానికి 2017లోనే ఈ ఇద్దరూ విడిపోయినా ఆ విషయాన్ని ప్రైవేటుగానే ఉంచేద్దాం అనుకున్నారట. కాకపోతే, జెన్నిఫర్ బర్త్‌డే తర్వాత గాసిప్స్ వస్తాయన్న అనుమానం రావడంతో, ఎట్టకేలకు తాము విడిపోయినట్లు అనౌన్స్ చేసేశారు. ‘‘భార్యాభర్తలుగా కొనసాగలేం అని అనుకున్నాక ఇద్దరం విడిపోవాలనే నిర్ణయించుకున్నాం. అయితే విడిపోయాకా మేమిద్దరం బెస్ట్ఫ్రెండ్స్గానే కొనసాగుతాం’’ అని ఇద్దరూ కలిసి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. గతంలో బ్రాడ్‌పిట్‌తో కూడా జెన్నిఫర్ ఇలా ఎలాంటి గొడవలు లేనప్పుడే సామరస్యంగా విడిపోయింది. -
రెండో హనిమూన్‌కు హీరోయిన్!
లాస్ ఏంజిల్స్: ఎక్కడికి వెళ్తున్నావ్ అంటే 'రెండో హనిమూన్‌కు' అని చెబుతోంది హీరోయిన్ జెన్నిఫర్ అనిస్టన్. నటుడు జెస్టిన్ థిరోక్స్తో వివాహమయ్యాక రెండేళ్లయినా గడవకముందే వీరి మధ్య చెడింది. తమ పెళ్లి గురించి వీరు గతంలో బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వీరు విడిపోతున్నట్లే అని వార్తలొచ్చాయి. అయితే.. ఈ బీటలువారిన బంధానికి మళ్లీ పూతలు పూయాలని భావిస్తోంది జెన్నీ. భర్తతో కలిసి కొన్నాళ్లపాటు ప్రైవేటు ట్రిప్‌కు వెళ్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. ఈ ట్రిప్‌తో అయినా వైవాహిక బంధం మళ్లీ బలపడుతోందని జెన్నీ ఆశలు పెట్టుకుంది. 2012లో కలిసిన ఈ జంట.. రెండేళ్లపాటు డేటింగ్లో ఉండి 2015లో పెళ్లితో ఒకటయ్యారు. అయితే.. జెన్నీ మాజీ భర్త బ్రాడ్పీట్ విషయంలోనే థిరోక్స్తో విభేదాలొచ్చాయని గాసిప్స్ గుప్పుమన్నాయి.