రెండో హనిమూన్‌కు హీరోయిన్‌! | Jennifer Aniston and Justin Theroux are reportedly trying to fix their broken marriage | Sakshi
Sakshi News home page

రెండో హనిమూన్‌కు హీరోయిన్‌!

Published Sun, Jan 1 2017 10:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

రెండో హనిమూన్‌కు హీరోయిన్‌!

రెండో హనిమూన్‌కు హీరోయిన్‌!

లాస్‌ ఏంజిల్స్‌: ఎక్కడికి వెళ్తున్నావ్‌ అంటే 'రెండో హనిమూన్‌కు' అని చెబుతోంది హీరోయిన్‌ జెన్నిఫర్‌ అనిస్టన్‌. నటుడు జెస్టిన్‌ థిరోక్స్‌తో వివాహమయ్యాక రెండేళ్లయినా గడవకముందే వీరి మధ్య చెడింది. తమ పెళ్లి గురించి వీరు గతంలో బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వీరు విడిపోతున్నట్లే అని వార్తలొచ్చాయి.

అయితే.. ఈ బీటలువారిన బంధానికి మళ్లీ పూతలు పూయాలని భావిస్తోంది జెన్నీ. భర్తతో కలిసి కొన్నాళ్లపాటు ప్రైవేటు ట్రిప్‌కు వెళ్తున్నట్లు ఇటీవల వెల్లడించింది. ఈ ట్రిప్‌తో అయినా వైవాహిక బంధం మళ్లీ బలపడుతోందని జెన్నీ ఆశలు పెట్టుకుంది. 2012లో కలిసిన ఈ జంట.. రెండేళ్లపాటు డేటింగ్‌లో ఉండి 2015లో పెళ్లితో ఒకటయ్యారు. అయితే.. జెన్నీ మాజీ భర్త బ్రాడ్‌పీట్‌ విషయంలోనే థిరోక్స్‌తో విభేదాలొచ్చాయని గాసిప్స్‌ గుప్పుమన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement