jyoshna
-
మూడో రౌండ్లో జోష్నా
కైరో (ఈజిప్ట్): ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి జోష్నా చినప్ప మూడో రౌండ్‌కు చేరింది. హో జె లాక్ (హాంకాంగ్)తో శనివారం జరిగిన రెండో రౌండ్లో 12వ సీడ్ జోష్నా 11–5, 11–4తో రెండు గేమ్‌లను గెలిచి, మూడో గేమ్‌లో 3–0తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి గాయం కారణంగా వైదొలిగింది. -
జ్యోత్స్న మృతి కేసు : అంకుర్, పవన్‌ల అరెస్ట్
సాక్షి విశాఖపట్నం : నగరంలో తీవ్ర కలకలం రేపిన ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోత్స్న మృతి కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫ్యాకల్టీ అంకూర్, అతని స్నేహితుడు పవన్‌లను ఫోర్త్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్లో అంకుర్, జ్యోత్స్న మధ్య ఉన్న మెసేజ్‌లు, కాల్ డేటా, ఫోటోల ఆధారంగా న్యాయ సలహా మేరకు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశామని ఫోర్త్ టౌన్ సీఐ రవి తెలిపారు. అంకుర్, పవన్‌లపై ఐపీసీ 306,201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. కాల్ డేటా, మెసేజ్‌ల ద్వారా జ్యోత్స్న, అంకుర్‌ల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉందన్న విషయం తెలిసిందన్నారు. జ్యోత్స్న పోస్ట్‌మార్టం నివేదిక రావాడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఐ పేర్కొన్నారు. సంబంధిత వార్తలు బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం ప్రేమ వ్యవహారమే కారణమా..? -
ప్రేమ వ్యవహారమే కారణమా..?
విశాఖ సిటీ: ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోత్స్న మృతి కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ రోజు ఫ్లాట్‌లో ఏం జరిగింది.? జ్యోత్స్న మృతికి కారణమేంటి.? అనే వివరాలపై ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులకు పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. విద్యార్థిని మృతి చెందిన రోజున పవన్ ఫ్లాట్‌లోనే ఉన్నట్లు తేలింది. జ్యోత్స్నకు ఫ్యాకల్టీ అంకూర్కు మధ్య ప్రేమ వ్యవహారం సాగిందని దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. అయితే ఇదే యువతి మరణానికి కారణమా..? అనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని అంకూర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం, కాదు హత్యేనంటూ మృతురాలి తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఆరోపిస్తుండటంతో కేసుని సవాల్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీన అంకూర్ ఫ్లాట్‌కు వెళ్లడం, ఆమె అక్కడ ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే జ్యోత్స్న మృతి చెందిన సమయంలో తాను ఫ్లాట్‌లో లేనని, ఉదయం 9 గంటలకే కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చేసరికి మృతి చెందినట్లు గుర్తించానని పోలీసులకు అంకూర్ తెలిపారు. అయితే ఆ సమయంలో అంకూర్ స్నేహితుడు పవన్ ఫ్లాట్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ దిశగానూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఒకవేళ జ్యోత్స్న ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే గాజువాకలో ఉన్న తన నివాసంలోనూ.. లేదా చుట్టుపక్కల ఎక్కడైనా ఆత్మహత్యకు పాల్పడవచ్చు. కానీ గాజువాక నుంచి శాంతిపురంలోని అంకూర్ నివాసముంటున్న ఎన్క్లేవ్ ఫ్లాట్‌కి వచ్చి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు జ్యోత్స్న ఫోన్ లాక్ ప్యాట్రన్‌ని సాంకేతిక నిపుణుల ద్వారా తీసి కాల్ డేటాను చెక్ చెయ్యాలని భావిస్తున్నారు. మరోవైపు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమెది హత్యా..? లేదా ఆత్మహత్యా..? అనే నిర్థారణ కూడా వస్తుందని అభిప్రాయపడుతున్నారు. రెండు రోజుల్లో కేసుకి సంబంధించిన పూర్తి వాస్తవాలు వెల్లడి కానున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. -
జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం
విశాఖపట్నం , సీతమ్మధార(విశాఖ ఉత్తర): నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న మల్కాపురం దరి జనతా కాలనీకి చెందిన జ్యోత్స్న మృతిపై ఫోర్తుటౌన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్కయ్యపాలెం శాంతిపురం దరి కట్టా ఎన్‌క్లేవ్‌లోని ఫోర్తుప్లోర్‌లోని ప్లాట్‌లో జ్యోత్స్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌లో బిహార్‌కు చెందిన అంకోర్‌తోపాటు అతని స్నేహితుడు, మరో లెక్చరర్ పవన్ ఉంటున్నాడు. దీంతో ఇప్పటికే వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా జ్యోత్స్న ప్లాట్‌లోకి వెళ్లేటప్పటికి ఎవరున్నారు..? ఆమె ఆత్మహత్య చేసుకునే సమయంలో అంకోర్, పవన్ ఎక్కడున్నారు? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు ఇప్పటికే అపార్టుమెంట్ వాసులతో పాటు వాచ్‌మెన్‌ను విచారించారు. ఈ కేసు విచారణలో భాగంగా బుధవారం ఉదయం బుల్లయ్య కళాశాలకు సీఐ రవి వెళ్లారు. అక్కడి జ్యోత్స్న స్నేహితురాళ్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. మరోవైపు మృతురాలి ఫోన్లో ఉన్న మెసేజ్‌లు, చాటింగ్‌కు సంబంధించిన వివరాలు సేకరించి దర్మాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు ముందు జ్యోత్స్న ఎవరెవరికి ఫోన్ చేసింది..? అన్న వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు మృతురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు. మంగళవారం పోస్టుమర్టం పూర్తి కావడంతో ఇంకా రిపోర్టు రావాలసి ఉందని సీఐ రవి తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యే
విశాఖపట్నం, డాబాగార్డెన్స్ / పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): బీటెక్ విద్యార్థిని జ్యోత్స్నది ముమ్మాటికీ హత్యేనని మహిళ చేతన కార్యదర్శి కె.పద్మ ఆరోపించారు. నగరంలోని మల్కాపురం ప్రాంతానికి చెందిన జ్యోత్స్న(20) అనుమానాస్పద మృతిపై మహిళా సంఘాలు మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ విద్యార్థిని మృతిపై హత్య కోణంలో పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓ అమ్మాయి అనుమానస్పదంగా మృతి చెందితే దర్యాప్తు చేపట్టకుండా మృతదేహాన్ని మార్చురీకి తరలించే ప్రయత్నం పోలీసులు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలన్నారు. ఫ్యాకల్టీ రూమ్‌లో విద్యార్థిని మృతి చెందిందంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలపాలన్నారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్.ఎన్.మాధవి, ఆర్.విమల మాట్లాడుతూ నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఆడ పిల్లలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనలో మహిళా సంఘాల ప్రతినిధులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు పాల్గొన్నారు -
స్క్వాష్ లేకపోవడం నిరాశ కలిగించింది!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను క్రీడాంశంగా చేర్చకపోవడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని భారత స్టార్ క్రీడాకారిణి జ్యోత్స్న చిన్నప్ప వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాఖ్య ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదని ఆమె వివరించింది. ‘ఇది మా ఆటకు వెనకడుగులాంటిదే. ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్ పతకమే లక్ష్యం. ఇతర క్రీడాకారులతో సమానంగా మేం కూడా శ్రమిస్తాం కాబట్టి మాకూ అదే ఉంటుంది. ఒలింపిక్స్‌లో లేకపోతే కార్పొరేట్ సంస్థలు ప్రోత్సహించవు. స్పాన్సర్లు కూడా ముందుకు రారు. కాబట్టి స్క్వాష్‌ను తాజా నిర్ణయం ఇబ్బంది పెడుతుంది’ అని ఆమె అభిప్రాయ పడింది. అయితే రెజ్లింగ్‌ను తొలగించడమే తన దృష్టిలో తప్పని చెప్పింది. ‘కొత్త ఆటను చేర్చాలని అందరూ భావిస్తారు గానీ ఒక ప్రాచీన క్రీడను తొలగించాలని ఎవరూ కోరుకోరు. రెజ్లింగ్‌నే అసలు తప్పించకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఆ జాబితాలో ఉండేందుకు రెజ్లింగ్‌కు అర్హత ఉంది’ అని ఆమె విశ్లేషించింది. ఇటీవల అర్జున అవార్డు అందుకోవడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణాలుగా పేర్కొన్న జ్యోత్స్న... రాబోయే ఏడాది కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పింది. మరో వైపు భారత ఫుట్‌బాల్ ఆటగాడు గుర్మాంగీ సింగ్ మాట్లాడుతూ...ఐపీఎల్ తరహాలో ప్రతిపాదిస్తున్న ఫుట్‌బాల్ లీగ్ ఏ స్థాయిలో విజయవంతం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నాడు. తన కెరీర్ ప్రస్తుతం నిలకడగా సాగుతోందని, త్వరలో నాలుగు వారాల పాటు డెన్మార్క్ క్లబ్ తరఫు ఆడనున్నట్లు అతను వెల్లడించాడు. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘నైకీ’ నగరంలో ఏర్పాటు చేసిన కొత్త స్టోర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బుధవారం జ్యోత్స్న, గుర్మాంగీ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 36లో దాదాపు 400 చదరపు గజాల వైశాల్యంలో నైకీ కొత్త తరహా ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఈ షోరూం హైదరాబాద్‌లోనే అతి పెద్దదని ఆ సంస్థ మార్కెటింగ్ డెరైక్టర్ అవినాష్ పంత్ వెల్లడించారు. క్రికెటేతర క్రీడలతో కూడా తమ అనుబంధాన్ని కొనసాగించేందుకు మరిన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు.