Jyoti buddhaprakas
-
డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులు
► రైతులు, కూలీలకు చెల్లించేందుకు చర్యలు ►ఆర్టీజీఎస్ ద్వారా పత్తి కొనుగోళ్ల చెల్లింపులు ► కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ అధికారులతో సమావేశం ఆదిలాబాద్ అర్బన్ : నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన నేపథ్యంలో రైతులు, కూ లీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా డిజిటల్ విధానంలో నగదు చెల్లింపులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ జ్యో తిబుద్ధప్రకాశ్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. రూ. 500, రూ.వెరుు్య నోట్ల రద్దుతో రైతులు, కూలీ లు ఎలాం టి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో బ్యాంకు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు లు, కూలీలు, సామాన్య ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బం దులను తొలగించేందుకు కేంద్ర ప్రభు త్వ నిబంధనల మేరకు అన్ని బ్యాంకు లు, మార్కెట్లు, వ్యాపారుల వద్ద డిజి టల్ పద్ధతి ద్వారా నగదు చెల్లింపుల సౌ కర్యాలు కల్పించాలని సూచించారు. సౌ కర్యాల కల్పించడంతోపాటు వారికి అవగాహన కల్పించే బాధ్యత బ్యాంకు అధికారులపై ఉందన్నారు. బ్యాంకు ఖాతా లు లేని రైతులు, కూలీలు వెంటనే బ్యాంకు ఖాతాలు తెరిచి డిజిటల్ విధా నం ద్వారా అవగాహన పొంది నగదు లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ పొందాలని కోరా రు. పత్తి రైతులకు ఆర్టీజీఎస్ ద్వారా పత్తి కొనుగోళ్ల చెల్లింపులు చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. అ నంతరం వివిధ బ్యాంకు అధికారులు మాట్లాడుతూ బ్యాంకుల్లో సరిపడా డ బ్బు అందడం లేదన్నారు. రోజురోజుకు కేంద్ర ప్రభుత్వం నగదు విత్‌డ్రావల్స్ పరిమితి పెంచుతోందని, బ్యాంకుల్లో డబ్బు నిల్వలు లేనందున ప్రజల డి మాండ్ మేరకు నగదు లావాదేవీలు కొ నసాగించలేకపోతున్నామని పేర్కొన్నా రు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్ రాథోడ్, ఎల్డీఎం ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
చివరి భూములకూ నీరందిస్తాం
► కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ► రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం ఆదిలాబాద్ అర్బన్ : జిల్లాలోని చిన్న, మధ్యతరహా మిషన్ కాకతీయ చెరువుల ద్వారా ఆయా ప్రాజెక్టులు, ట్యాంకుల పరిధిలోని చివరి గ్రామాల రైతులకు కూడా సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల శాఖ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బజార్హత్నూర్, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టుల వద్ద చేపట్టిన పనులను సమీక్షించారు. ఈ ఏడాది పూర్తి చేసిన మిషన్ కాకతీయ చెరువుల ద్వారా గ్రామాల వారీగా ఎన్ని ఎకరాలు సాగు కానుందో తెలుపాలన్నారు. ఆయా గ్రామాల్లో సాగునీరు విడుదల చేసేముందు రైతులకు టాంటాం ద్వారా తెలుపాలన్నారు. జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. రెవెన్యూ అంశాలపై సమీక్ష అనంతరం రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. అధికారులు జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలన్నారు. ప్రధానంగా నీటి పన్నును స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వసూలు చేయాలన్నారు. గ్రామాలవారీగా జమాబందీ, క్రాప్ బుకింగ్, సాదాబైనామా కేసులు పరిష్కరించాలన్నారు. 2015-16 ఏడాదిలో పహణీలు అప్లోడింగ్ చేసి 100శాతం ఆధార్ నమోదు చేయాలని, అర్హత గల రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలని, రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అర్హులకే వర్తింపజేయూలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ భూములపై రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సమస్యలు తెలుసుకుని తహసీల్దార్లకు అందించాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. దళితబస్తీ పథకం అమలులో ఇతర జిల్లాల కంటే ఆదిలాబాద్‌ను ముందంజలో ఉంచడానికి కృషి చేయాలన్నారు. ఈ పథకం కింద ఇంకెంతమందికి భూమి పంపిణీ చేయాల్సి ఉందో గ్రామాల వారీగా వివరాలు సేకరించి అందించాలని దళిత అభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు. జేసీ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ సుశీల్, జేడీఏ ఆశాకుమారి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ జిల్లా సమగ్ర సమాచారం
ఆదిలాబాద్ కలెక్టర్: జ్యోతిబుద్ధప్రకాశ్ ఫోన్: 9491053696 ఎస్పీ: మిట్ట శ్రీనివాస్ ఫోన్: 9440795000 ఇతర ముఖ్య అధికారులు జాయింట్ కలెక్టర్: కష్ణారెడ్డి (9491053661) డీఆర్వో: ఐలయ్య (ఇన్చార్జి) (9491053535) డీపీవో: పోచయ్య (9676959001) డీఈవో : లింగయ్య (9849909119) డీఎంహెచ్‌వో: సుబ్బారాయుడు (9849902481) ఐసీడీఎస్ పీడీ: మాస ఉమాదేవి (9440814455) డీఆర్డీఏ పీడీ: రాజేశ్వర్ రాథోడ్ (9866100494) రెవెన్యూ డివిజన్లు: 2 (ఆదిలాబాద్, ఉట్నూర్) మండలాలు: 18 (ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్(కొత్త), మావల (కొత్త), బేల, జైనథ్, నేరేడిగొండ, ఇచ్చోడ, బోథ్, బజార్హత్నూర్, గుడిహత్నూర్, తాంసి, తలమడుగు, భీంపూర్, సిరికొండ, ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ) మున్సిపాలిటీ: 1 (ఆదిలాబాద్) గ్రామ పంచాయతీలు: 275 భారీ ఇండస్ట్రీస్: జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్, స్పిన్నింగ్ మిల్స్, సోయా సంబంధిత ఫ్యాక్టరీలు సాగునీటి ప్రాజెక్టులు: మత్తడివాగు, సాత్నాల, కొరాట–^è నాఖా బ్యారేజీ ఎమ్మెల్యేలు: జోగు రామన్న(ఆదిలాబాద్), రాథోడ్ బాపూరావు(బోథ్), అజ్మీరా రేఖానాయక్(ఖానాపూర్), కోవ లక్ష్మి(ఆసిఫాబాద్) ఎంపీ: జి.నగేశ్ పర్యాటకం, ఆలయాలు: కుంటాల, పొచ్చెర, కనకాయి, గాయత్రీ జలపాతాలు, కేస్లాపూర్ నాగోబా ఆలయం, జైనథ్‌లో లక్ష్మీనారాయణ ఆలయం జాతీయ రహదారి: ఆదిలాబాద్ – ఎన్‌హెచ్ 44 రైల్వేలైన్: ఆదిలాబాద్–ముత్ఖేడ్, ఆదిలాబాద్–నాగ్‌పూర్ హైదరాబాద్ నుంచి దూరం: 300 కి.మీ. ఖనిజాలు: మాంగనీస్, సున్నపురాయి