‘నిర్భయ’లు చిగురించాలి
ఆ ఘటనకు నేటితో రెండేళ్లు. పచ్చగా ఎదుగుతున్న ఒక లేలేత చిగురుటాకును ఢిల్లీ నడివీధుల్లో కొందరు ముష్కరులు నడి రాత్రి చిదిమేసిన ఆ కాళరాత్రికి నేటితో రెండేళ్లు. పేదరికంతో మగ్గుతున్న కుటుంబానికి ఆసరాగా ఉండాలని, సోదరుడి చదువుకు సాయపడాలని ఆ చిన్ని జీవితం కన్న కలల్ని, క్షణంలో కల్లలుగా చేసిన ఘటనకు దేశరాజధానే సజీవ సాక్ష్యమై నిలి చింది. మన గొప్ప దేశంలో పసిపిల్లలకు, బాలిక లకు, వివాహితులకు, చివరకు కాటికి కాచుకున్న పండు ముదుసళ్లకు కూడా రక్షణలేదు.
ఈ భయా నక సామాజిక దౌష్ట్యానికి మారుపేరు అత్యాచా రం. ఈ దేశ స్త్రీ పొందిన జాతీయ అవమానానికి సంకేతం నిర్భయ. బతుకుపై గంపెడాశలు పెట్టుకుని కనుమ రుగైన జ్యోతిసింగ్ పాండే నేడు భారతీయ మహిళల చైతన్యం లో, తిరుగుబాటులో సజీవమైనిలుస్తోంది. తమకు జరిగిన అవ మానాన్ని దిగమింగి ఊరు కోకుండా వందలాది మంది భారత స్త్రీలు ఇవ్వాళ గొంతెత్తి నినదిస్తున్నారంటే ఆ జ్యోతి వెలిగించిన చైతన్యమే కారణం. ఆ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన నిర్భయను జీవితంలో ప్రతిక్షణంలోనూ గుర్తుంచుకోవడమే నివాళి.
ప్రత్యూష హైదరాబాద్