21మంది జ్యోతిష్మతీ విద్యార్థులకు ఉద్యోగాలు
తిమ్మాపూర్, న్యూస్‌లైన్: మండలంలోని జ్యోతిష్మతీ ఇంజినీరింగ్ విద్యాసంస్థలో హైదరాబాద్‌కు చెందిన ఏజిల్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ కంపెనీ వారు శుక్రవారం నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో 20 మంది ఎంపికైనట్లు చైర్మన్ జె.సాగర్‌రావు తెలిపారు. కళాశాలలోని అన్ని గ్రూప్‌లకు చెందిన 140 మంది హాజరు కాగా రెండు రౌండ్లలో 20 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్నారు.
వీరికి కంపెనీ ప్రతినిధి సృజన నియామక పత్రాలు అందించారు. విద్యార్థులు ఐటీ రిక్రూటర్స్‌గా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తారని ప్రతినిధి తెలిపారు. కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఇది 16వ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని, వీటిని విద్యార్థులు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ వి.పూర్ణచంద్రరావు, డెరైక్టర్ వెంకట్రావు కోరారు.
నేడు మరో రిక్రూట్మెంట్ డ్రైవ్
జ్యోతిష్మతీ విద్యాసంస్థల్లో శనివారం రైజ్ కార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించనున్నట్లు కళాశాల ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఇందులో సీఎస్ఈ, ఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులు, ఎంటెక్ కంప్యూటర్స్ విద్యార్థులు అర్హులని చెప్పారు.