అబద్ధాలు చెప్పడంలో బాబు దిట్ట
కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి
బెంగళూరు, న్యూస్‌లైన్ : అబద్ధాలు చెప్పడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు మించిన వారు లేరని కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి దుయ్యబట్టారు. గురువారం నగరంలోని యలహంక, బొమ్మనహళ్లి నియోజకవర్గంలోని హెబ్బగోడిలో ప్రవాసాంధ్ర ఓటర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో కే.భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు నోటి నుంచి ఏనాడు నిజం రాదని అన్నారు. ఈనెల 7న సీమాం ధ్రలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నగరంలోని ప్రతి ప్రవాసాంధ్రుడు తమతమ గ్రామాలకు వెళ్లి ఓటును వైఎస్ఆర్ సీపీ చిహ్నమైన ఫ్యాన్ గుర్తు వేసి పార్టీ విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నారని, రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మొసలి కన్నీరు కారుస్తున్నారని అలాం టి వ్యక్తి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన తొమ్మిదే ళ్ల పాలనలోకి ఎవరు తొంగి చూడలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేశానని చంద్ర బాబు చెప్పడం అనుమానం కలుగుతోందన్నారు. బాబు పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా కుంటుపడటమే గాక రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయాయని గుర్తు చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ గురించి నటుడు పవన్‌కల్యాణ్ ఇష్టానుసారం మాట్లాడటం తగదని, ఆయన వ్యాఖ్యలు కాస్త తగ్గించుకుంటే మంచిద ని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను సహించలేక నటుడు బాలకృష్ణ పిచ్చిగా మాట్లాడుతున్నారని, హిందూపురం ఓటర్లను ఆయన బుద్ధి చెప్పే సమయంలో ఆసన్నమైందన్నారు. సీమాంధ్ర అన్నిరంగాల్లో అభివృద్ధిలో నడవాలంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ ుుఖ్యమంత్రి కావాలని ఆ దిశగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, తమ గ్రామాలకు తరలివెళ్లి పార్టీ విజయానికి కృషి చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేయాలన్నారు.
సమావేశంలో డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ జాయింట్ సెక్రటరి బత్తుల అరుణాదాస్, కార్యదర్శి రాకేశ్‌రెడ్డి, కోశాధికారి కొండా దామోదరరెడ్డి, ఫౌండేషన్ ఆర్గనైజింగ్ సభ్యుడు ఎస్.రాజశేఖర్‌రెడ్డితో పాటు ప్రవాసాంధ్రులు మదుసూధన్‌రెడ్డి, అమరనాథరెడ్డి, నాగరాజు, అరుణ, అబ్దూల్ లతీఫ్, శ్రీను, హరీష్, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 7న ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు తరలివెళ్లే హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ ప్రవాసాంధ్ర ఓటర్లు కర్ణాటక డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కే.భక్తవత్సలరెడ్డి-8880022888, బత్తులఅరుణాదాస్-9535119942, ఎస్.రాజశేఖర్‌రెడ్డి-9448854651 నెంబర్లును సంప్రదించాలని కోరారు.