బెంగళూరులో మైసూరు మహారాజు `వొడెయార్` మృతి
మైసూరు: మైసూరు రాజవంశస్థుడైన శ్రీకాంత్ దత్తా నరసింహారాజా వొడెయార్ (60) గుండెపోటుతో మరణించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ రోజు మధ్యాహ్నం 3. 30 గంటల ప్రాంతంలో వొడెయార్ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. హృద్వేగ సంబంధిత వ్యాధి కారణంగా ఆయన చికిత్స నిమిత్తం విక్రమ్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయన ప్రాణం నిలబెట్టేందుకు ఎంతోగానూ ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఆ ఆస్పత్రి ఇన్ చార్జీ కె. మదన్ కుమార్ చెప్పారు.
వివరాల్లోకి వెళితే..
శ్రీకాంత్ దత్తా నరసింహారాజా వొడెయార్ బెంగళూర్ ఫ్యాలెస్ లో తన ఇద్దరి సోదరిమణులు, ఇతర కుటుంబ సభ్యులతో నివాస ముంటున్నారు. అయితే శ్రీకాంత్ దత్తా గుండె ఒక్కసారిగా స్తంభించిపోవడంతో ఆయన్నుమధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో హుటాహుటినా విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. వొడెయార్ ను పునరుజ్జీవితుడిని చేసేందుకు వెంటిలేటర్ ను అమర్చినా వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా.. ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. చివరికి వొడెయార్ మరణించినట్టు హృద్రోగ చికిత్స నిపుణుడు రంగనాథ నాయక్ నిర్ధారించినట్టు మదన్ కుమార్ పేర్కొన్నారు.